Disha Patani Special Song in Allu Arjun Sarainodu

Disha patani special song in allu arjun sarainodu

Allu Arjun Romance with Disha Patani, Disha Patani special song, Disha Patani in Allu Arjun Sarainodu, Disha Patani in Sarainodu, Disha Patani latest stills, Disha Patani hot stills, Disha Patani movies, Allu Arjun Sarainodu movie stills, Allu Arjun latest news, Allu Arjun movie updates, Allu Arjun movie details, Allu Arjun

Disha Patani Special Song in Allu Arjun Sarainodu: Stylish star allu arjun latest film sarainodu. boyapati srinu director, Rakul preet singh heroine.

‘సరైనోడు’తో లోఫర్ భామ మాస్ మసాలా

Posted: 01/07/2016 04:20 PM IST
Disha patani special song in allu arjun sarainodu

‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘రుద్రమదేవి’ చిత్రాల తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సరైనోడు’(వర్కింగ్ టైటిల్). ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన ప్రముఖ కమర్షియల్ మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన రకూల్ ప్రీత్ సింగ్, కెథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులోని ఓ స్పెషల్ సాంగ్ కోసం అంజలి, అనుష్క వంటి పలు హీరోయిన్లను సంప్రదించారని వార్తలొచ్చాయి. కానీ ఈ పాటలో గ్లామర్ డోస్ ఎక్కువగా వుండబోతుండటంతో వారు నిరాకరించినట్లుగా తెలిసింది. అయితే తాజాగా ఆ పాటలో ‘లోఫర్’ హీరోయిన్ ను ఖరారు చేసినట్లుగా తెలిసింది.

‘లోఫర్’ సినిమాలో గ్లామర్ తో మెప్పించిన దిశా పటానీని ‘సరైనోడు’ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం ఎంపిక చేసినట్లుగా తెలిసింది. ఈ పాటలో గ్లామర్ డోస్ కాస్త ఎక్కువగా వుందనే వార్తలొస్తున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ సాంగ్ ను చిత్రీకరించనున్నారని సమాచారం. ఇందులో శ్రీకాంత్, ఆదిపినిశెట్టిలు కీలక పాత్రలలో నటిస్తున్నారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సంక్రాంతి కానుకగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Disha Patani  Allu Arjun  Sarainodu  Special song  Rakul preet singh  

Other Articles