Sai Dharam Tej | Vaishnav Tej | Movie News

Another hero ready to introduce from mega family

Another Hero Introduce from Mega Family, sai dharam tej brother, Vaishnav tej introduce as a hero, sai dharam tej latest news, sai dharam tej movie news, sai dharam tej movie updates, sai dharam tej stills, sai dharam tej

Another Hero Ready to Introduce from Mega Family: Mega Dancing hero sai dharam tej brother Vaishnav tej ready to enter into tollywood as a hero.

హీరోగా మెగాస్టార్ మరో మేనల్లుడు?

Posted: 11/27/2015 11:47 AM IST
Another hero ready to introduce from mega family

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఇప్పటికీ చాలా మంది హీరోలొచ్చేసారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా బ్రదర్ నాగబాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మెగావపర్ స్టార్ రాంచరణ్ తేజ, డాన్సింగ్ స్టార్ సాయిధరమ్ తేజ, వరుణ్ తేజ, అల్లు శిరీష్... వీరంతా కూడా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినవారే. తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం నిహారిక హీరోయిన్ గా నటిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

అయితే ఇపుడు మెగా ఫ్యామిలీ నుంచి మరో వ్యక్తి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. సాయిధరమ్ తేజ తమ్ముడు వైష్ణవ్ తేజ్. వైష్ణవ్ ‘శంకర్ దాదా జిందాబాద్’ సినిమాలో పేషేంట్ పాత్రలో నటించాడు. ప్రస్తుతం యాక్టింగ్, డాన్స్, ఫైటింగ్స్ లలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. వైష్ణవ్ తో సినిమా తీయడానికి పలువురు దర్శకులు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

కానీ నటనలో పూర్తిస్థాయి శిక్షణ తీసుకున్న తర్వాతే సినిమాల్లోకి వస్తానని వైష్ణవ్ చెబుతున్నాడట. అంతేకాకుండా తన మొదటి సినిమా ఎలా వుండాలనే విషయంలో పలువురు అగ్ర నటుల సలహాలు కూడా తీసుకుంటున్నట్లుగా తెలిసింది. మరి వైష్ణవ్ ఎంట్రీ ఎలా వుండనుందో భవిష్యత్తులోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sai dharam tej  Vaishnav Tej  Movie News  stills  

Other Articles