Anushka | Size Zero | Open Letter

Anushka open letter to her fans about size zero film

Anushka Open Letter to Her fans, Anushka Size Zero Movie Gold Contest, Anushka Size Zero Latest Posters, Anushka Size Zero movie news, Anushka Size Zero movie updates, Anushka Size Zero stills, Anushka Size Zero, Anushka, Size Zero

Anushka Open Letter to Her fans About Size Zero Film: Starring Arya, Anushka Shetty, Sonal Chauhan, Prakash Raj, Urvashi, Bharat and others, Anushka Size Zero movie Release on 27 November.

ప్రేమతో... ఫ్యాన్స్ కు ‘సైజ్ జీరో’ బ్యూటీ లెటర్

Posted: 11/27/2015 11:51 AM IST
Anushka open letter to her fans about size zero film

ఇప్పుడున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో నటనకు ప్రాధాన్యమిస్తూ, సినిమాలోని పాత్రకోసం ఏం చేయడానికైనా సిద్ధపడే వ్యక్తిత్వం వున్న వారిలో ప్రథమ స్థానం అనుష్కకే దక్కుతుంది. ‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’.. ఇలా ప్రతీ సినిమాలో కూడా తన పాత్రకు న్యాయం చేయడానికి ఎంతో కష్టపడి చేస్తోంది. అంతేకాకుండా ఆ పాత్రకు పూర్తి న్యాయం చేకూర్చగల ఏకైక నటిగా అనుష్క భారీ ప్రశంసలను అందుకుంటుంది.

‘బాహుబలి’ సినిమా కోసం తన బాడీని ఫిట్ గా మార్చేసుకుంది. ఆ తర్వాత తాను చేయబోయే ‘సైజ్ జీరో’ సినిమా కోసం భారీగా బరువు పెరిగింది. ‘సైజ్ జీరో’ కోసం అనుష్క నాచ్యురల్ గానే బరువు పెరగడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక సినిమా పట్ల తను చూపించే డెడికేషన్ ఇప్పటివరకు ఏ నటి కూడా చూపించలేదని చెప్పుకోవచ్చు. అయితే ‘సైజ్ జీరో’ సినిమా ఈరోజు(నవంబర్ 27) ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో గ్రాండ్ గా విడుదలవుతుంది.

ఈ సంధర్భంగా సినీ ప్రేక్షకులకు, తన అభిమానులకు అనుష్క ఓ బహిరంగ లేఖను రాసింది. ‘సైజ్ జీరో’ సినిమాను కుటుంబ సమేతంగా చూడండంటూ కోరుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మొదటినుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది గంటల్లో తెలియనుంది.

Anushka Open Letter to Her fans About Size Zero Movie-02

అనుష్క, ఆర్య, ఊర్వశి, సోనాల్‌ చౌహాన్‌, ప్రకాష్‌ రాజ్‌, ఊర్వశి, గొల్లపూడి మారుతీరావు, అడవిశేష్‌, పోసాని కృష్ణమురళి, భరత్‌, బ్రహ్మానందం తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: యం.యం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, డైలాగ్స్‌: కిరణ్‌ కుమార్‌, సాహిత్యం: అనంత్‌ శ్రీరామ్‌, శ్రీమణి, యం.యం.కీరవాణి, ఆర్ట్‌: ఆనంద్‌ సాయి, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డ్యాన్స్‌: రాజుసుందరం, బృంద, ఫిరోజ్‌ఖాన్‌, కాస్ట్యూమ్స్‌: ప్రశాంత్‌, కథ, స్క్రీన్‌ప్లే: కణిక థిల్లాన్‌ కోవెలమూడి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: సందీప్‌ గుణ్ణం, నిర్మాత: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్ అన్నే, దర్శకత్వం: ప్రకాష్‌ కోవెలమూడి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Anushka  Size Zero  Open Letter  Trailers  Songs  

Other Articles