Naga babu | Fires | Angry | Pawan kalyan | Speech | stills | video | news

Naga babu warns to pawan kalyan fans

Naga babu fires on pawan kalyan fans, Naga babu fires on pawan kalyan, Naga babu fires pawan kalyan, Naga babu angry on pawan kalyan, Naga babu warns to Pawan kalyan, Naga babu warning to pawan, Naga Babu, Pawan Kalyan

Naga babu warns to pawan kalyan fans: Mega hero Naga babu fires on power star pawan kalyan in megastar chiranjeevi birthday celebrations.

పవర్ స్టార్ పై తనకోపం మొత్తం తీర్చేసుకున్న నాగబాబు

Posted: 08/22/2015 03:49 PM IST
Naga babu warns to pawan kalyan fans

మెగా బ్రదర్ గా ప్రముఖ నటుడు నాగబాబు ఇప్పటివరకు చాలా మంచి పేరును సంపాదించుకున్నారు. నాగబాబు ఎప్పుడూ కూడా నవ్వుతూ, నవ్విస్తూ కనిపిస్తుంటారు. కానీ అలాంటి నాగబాబు నిన్న తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై వున్న తన ఆగ్రహాన్ని మొత్తం బయటపెట్టేసాడు.

నిన్న అభిమానుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో మెగా ఫ్యామిలీకి చెందిన నటులంతా కూడా హాజరయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ వేడుకకు దూరంగా వున్నారు.

మాములుగా మెగా ఫ్యామిలీ సంబంధించిన ఏ కార్యక్రమంలోనైనా పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు గోల గోల చేస్తారనే విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఆ వేడుకకు రాకపోతే.. అందుకు గల కారణం చెప్పేవరకు కూడా అభిమానులు ఊరుకోకుండా గోల చేస్తునే వుంటారు.

అయితే నిన్న జరిగిన చిరు పుట్టినరోజు వేడుకలో కూడా పవన్ కళ్యాణ్ రాకపోవడంతో అభిమానులు ‘పవర్ స్టార్’ అంటూ తెగ గోల గోల చేసారు. దీంతో మెగా బ్రదర్ నాగబాబు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. పవన్ కళ్యాణ్ కోసం గోల చేసే అభిమానులపై భారీ ఎత్తున తన ఆగ్రహం వ్యక్తం చేసారు.

ఈ వేడుకలో నాగబాబు మాట్లాడుతున్న సమయంలో అభిమానులంతా కూడా ‘పవర్ స్టార్’ అంటూ గోల చేయడంతో... నాగబాబు ఒక్కసారిగా వారిపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. నాగబాబు మాట్లాడుతూ.... ఇన్నిరోజులు చాలా ఓపిక పట్టాం. మేము చేసే ప్రతి కార్యక్రమానికి పిలుస్తాం. అయినా కూడా రాడు. ఎన్నిసార్లు పవన్ ను పిలిచామో మీకు తెలుసా? ఇక్కడికొచ్చి పవర్ స్టార్ అని అరవడం కాదు.. మీకు దమ్ముంటే వాడి ఆఫీసుకు, ఇంటికి వెళ్లి అక్కడ అడగండి. వేడుకలకు రమ్మనండి. అంతేకానీ ఇలా కావాలని అల్లరిచేయడం కరెక్ట్ కాదు. మాకు తెలియదా.. మా తమ్ముడు రావాలని? మీకు దమ్ముంటే అక్కడ వెళ్లి అడగంగి. అంతేకానీ ఇక్కడ ‘పవర్ స్టార్’ అంటూ అరవకండి అంటూ భారీ ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga babu  Fires  Angry  Pawan kalyan  Speech  stills  video  news  

Other Articles