After A Long Time Pawan Kalyan Met Chiranjeevi On His Birthday Event To Wish | Tollywood News

Pawan kalyan met chiranjeevi on his birthday event

pawan kalyan, chiranjeevi, chiru 60th birthday, pawan met chiranjeevi, chiranjeevi controversies, pawan kalyan controversies, pawan wish chiranjeevi, chiranjeevi birthday celebrations, pawan kalyan visit chiru birthday

Pawan Kalyan Met Chiranjeevi On His Birthday Event : After A Long Time Pawan Kalyan Met Chiranjeevi On His Birthday Event To Wish. According To This Meet It Has Been Cleared That There Are No Differences Between Them.

అన్నయ్య ఇంటికెళ్లిన తమ్ముడు

Posted: 08/22/2015 06:37 PM IST
Pawan kalyan met chiranjeevi on his birthday event

జనసేనాధిపతి-పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మెగాస్టార్ చిరంజీవి మధ్య విభేదాలున్నాయని గతకొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే! తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని పలు సందర్భాల్లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ వివరణ ఇచ్చినప్పటికీ.. విభేదాల ప్రచారం మాత్రం కొనసాగుతూనే వచ్చింది. ఇక చిరంజీవి 60వ బర్త్ డే సందర్భంగా శుక్రవారం అభిమానుల కోసం హైదరాబాద్ లోని శిల్పాకళావేదికలో నిర్వహించిన గ్రాండ్ పార్టీకి పవన్ హాజరు కాకపోవడంపై ఆ అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆ వేడుకల్లో పవన్ కనిపించకపోవడంతో పవర్ స్టార్ కావాలంటూ అభిమానులు గోల చేయగా.. నాగబాబు మొట్టికాయలేసారు. ‘వాడిని ఎన్నిసార్లు పిలిచినా రావడం లేదు. దానికి మేము ఏం చేస్తాం’ అని మండిపడటంతో.. చిరు-పవన్ మధ్య విబేధాలున్నాయనే వార్తలు మరింత బలంగా వీచాయి.

అయితే ఈ వార్తలను తెరదించుతూ పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కలవడానికి శనివారం నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవికి పవన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చాలాకాలం తర్వాత అన్నయ్య ఇంటికెళ్లిన పవన్.. కుటుంబ సభ్యులతో దాదాపు 50 నిముషాల వరకు గడిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పార్క్‌హయత్ హోటల్‌ లో నిర్వహించనున్న చిరు బర్త్ డే గ్రాండ్ ఈవెంట్ కి పవన్ కూడా వెళ్లనున్నట్లు సమాచారం. ఏదేమైనా.. పవన్ నేరుగా చిరు ఇంటికే వెళ్లి ఆయనతో ముచ్చటించడంతో వారి మధ్య విభేదాలు లేవని స్పష్టం అవుతోంది. మరోవైపు.. వీరిద్దరు చాలాకాలం తర్వాత కలడవంపై మెగాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా.. చిరు పుట్టినరోజు సందర్భంగా పార్క్ హయాత్ హోటల్ కు బాలీవుడ్ తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల నుండి పలువురు ప్రముఖులు హాజరు కాబోతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chiranjeevi birthday  pawan kalyan  pawan met chiru  

Other Articles