Actress Nitya menon hot comments on south film industry actors

Actress nitya menon hot comments on south film industry actors

Nitya menon hot comments on south film industry, Nitya menon hot comments, Nitya menon latest news, Nitya menon movie news, Nitya menon movie updates, Nitya menon stills, Nitya menon news, Nitya menon movie details, Nitya menon hot stills, Nitya menon gallery

Actress Nitya menon hot comments on south film industry actors: tollywood star heroine Nitya menon hot comments on south film industry actors and directors. Nitya menon latest news, movies, gossips, stills, gallery.

హీరోయిన్లను అలా వాడుకోవద్దంటున్న కేరళ కుట్టి నిత్యామీనన్

Posted: 07/29/2015 02:59 PM IST
Actress nitya menon hot comments on south film industry actors

‘అలా మొదలైంది’ చిత్రంతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి నిత్యామీనన్ వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతుంది. గ్లామర్ పాత్రలలో కాకుండా నటిగా తనను తాను నిరూపించుకుంటూ వరుస హిట్ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోతుంది. ఈ అమ్మడు నటించిన చిత్రాలన్నీ కూడా వరుసగా విజయం సాధిస్తుండటంలో భారీ అవకాశాలు వచ్చిపడుతున్నాయి.

తెలుగు, తమిళం భాషలలో నిత్యామీనన్ కు ప్రస్తుతం భారీ క్రేజ్ ఏర్పడింది. గ్లామర్ పాత్రలకు ఎంత మాత్రం ఒప్పుకొని ఈ అమ్మడు ప్రస్తుతం గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది. తన క్యూట్ క్యూట్ హవాభావాలతో ప్రేక్షకులను ఇట్టే కట్టిపడేస్తుంది. అలాంటి ఈ అమ్మడికి ఓ విషయంలో చాలా కోపమొచ్చింది.

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యం ఎక్కువగా వుందంటూ గతంలో చాలా మంది హీరోయిన్లు పలు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యమే ఎక్కువగా నడుస్తోందని, హీరోయిన్లు కేవలం గ్లామర్ షో లకే పరిమితం చేస్తున్నారంటూ పలు కామెంట్లు చేసారు చాలా మంది హీరోయిన్లు.

అయితే తాజాగా కేరళ కుట్టి నిత్యామీనన్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో హీరోల ఆధిక్యం కొనసాగుతూనే వుందని ఆరోపించింది. అంతే కాకుండా హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే ఉపయోగించుకుంటున్నారని, ఈ విధానంలో మార్పు రావాల్సిన అవసరం వుందన్నారు. హీరోయిన్లకు ప్రాముఖ్యతను ఇవ్వాలంటూ నిత్యామీనన్ కోరారు.

అయితే తాను మాత్రం ఇప్పటివరకు ఎలాంటి గ్లామర్ పాత్రలలో నటించకుండా కేవలం నటిగా తనను తాను నిరూపించుకునే పాత్రల్లో మాత్రమే నటించానని, భవిష్యత్తులో కూడా నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలలో మాత్రమే నటిస్తానని నిత్యామీనన్ చెప్పుకొచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitya menon  Hot comments  Movie news  stills  

Other Articles