Producer Dil Raju bags Rudramadevi Distribution Rights

Producer dil raju bags rudramadevi distribution rights

Dil Raju bags Rudramadevi Film Distribution Rights, Dil Raju bags Rudramadevi Rights, Rudramadevi movie news, Rudramadevi movie updates, Rudramadevi release date, Rudramadevi stills, Rudramadevi posters, Rudramadevi trailers, Rudramadevi

Producer Dil Raju bags Rudramadevi Distribution Rights: Anushka upcoming film Rudramdevi. Gunashekhar director. Dil Raju bags Rudramadevi Film Distribution Rights.

రుద్రమదేవి హక్కులను దక్కించుకున్న దిల్ రాజు

Posted: 07/29/2015 11:03 AM IST
Producer dil raju bags rudramadevi distribution rights

ఫస్ట్ ఇండియన్ హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ చిత్రంగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రుద్రమదేవి’. ప్రముఖ దర్శకుడు స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు. ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. దీంతో ‘రుద్రమదేవి’ చిత్రానికి బిజినెస్ ప్రారంభమయ్యింది.

తాజా సమాచారం ప్రకారం ‘రుద్రమదేవి’ చిత్ర నైజాం మరియు ఉత్తరాంధ్ర ఏరియాల డిస్ట్రిబ్యూషన్ హక్కులు భారీగా అమ్ముడుపోయింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ‘రుద్రమదేవి’ చిత్రానికి సంబంధించిన నైజాం మరియు ఉత్తరాంధ్ర ఏరియాల డిస్ట్రిబ్యూషన్స్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడు.

గతంలో దిల్ రాజు ఏ చిత్రాన్నైనా కూడా కేవలం నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను మాత్రమే సొంతం చేసుకునేవారు. కానీ ‘రుద్రమదేవి’ చిత్రానికి సంబంధించి రెండు ఏరియాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకోవడంతో... ‘రుద్రమదేవి’ చిత్ర యూనిట్ చాలా సంతోషంగా వున్నారు.

దిల్ రాజు ఈ హక్కులను సొంతం చేసుకోవడంతో ‘రుద్రమదేవి’ చిత్ర యూనిట్ కు మరింత బలం వచ్చినట్లుగా కనిపిస్తోంది. అనుష్క, అల్లు అర్జున్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రంలో రానా, కృష్ణంరాజు, ప్రకాశ్ రాజ్, నిత్యామీనన్, కెథరిన్, హంసానందిని, బాబా సెహగల్ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudramadevi  Dil Raju  Distribution Rights  Trailers  Release Date  

Other Articles