Kona Venkat comments on Ram charan film

Kona venkat comments on ram charan film

Kona Venkat tweets on Ram charan film, Kona Venkat tweets on Ram charan, Ram charan movie news, Ram charan movie updates, Ram charan movie stills, Ram charan details, Ram charan shooting news, Ram charan

Kona Venkat comments on Ram charan film: Ram charan latest film shooting under srinu vaitla direction. Rakul preet singh heroine. Kona Venkat, gopi mohan script writers. thaman music.

చెర్రీ సినిమాకు దిష్టి తగలొద్దని ఏం చెప్పట్లేదట!

Posted: 06/30/2015 11:07 AM IST
Kona venkat comments on ram charan film

‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రాంచరణ్ సరసన రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో శ్రీనువైట్ల సినిమాలకు రచయితలుగా పనిచేసిన కోన వెంకట్, గోపి మోహన్ లు కొంత గ్యాప్ తర్వాత మరోసారి శ్రీనువైట్లతో కలిసి పనిచేస్తున్నారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కోనవెంకట్, గోపి మోహన్ కథను సమకూరుస్తున్నారు. అయితే ఇటీవలే ఈ సినిమా గురించి గోపిమోహన్ తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా... ఇటీవలే చరణ్ కొత్త సినిమా రషెస్ చూసానని, చూసి చాలా థ్రిల్ అయ్యానని తెలిపాడు. ఇలాంటి సినిమాకు రైటర్ గా పనిచేయడం చాలా సంతోషంగా వుందని, శ్రీనువైట్ల ప్రతి సీన్ ను ది బెస్ట్ అవుట్ పుట్ ఇస్తున్నాడని చెప్పుకొచ్చాడు. అలాగే ఇందులో చాలా చాలా స్టైలిష్ గా, సూపర్బ్ గా వున్నాడని, అతని స్టైల్, డాన్సుల్లో ఎనర్జీ చూసి అతనితో లవ్ లో పడిపోయానంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ సినిమాకు హీరోయిన్ రకూల్ ప్రీత్ సింగ్ తన ఫ్రెష్ నెస్ ను జతచేసిందని, మనోజ్ పరమహంస కెమెరా వర్క్ బాగుందంటూ గోపి మోహన్ ప్రశంసలు కురిపించాడు.

అయితే తాజాగా ఈ సినిమా గురించి కోన వెంకట్ కూడా పలు ప్రశంసలు కురింపించాడు. చరణ్ సినిమాకు అన్నీ శుభ పరిణామాలే జరుగుతున్నాయి. సినిమా చాలా బాగా వస్తోంది. దిష్టి తగులుతుందని కొన్ని ఆసక్తికర విషయాలని ఇప్పుడే చెప్పదల్చుకోలేదు అంటూ ట్వీట్ చేసాడు కోన వెంకట్. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ’, ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే రకరకాల టైటిల్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ స్టంట్ మాస్టర్‌గా కనిపిస్తాడని తెలుస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు శ్రీనువైట్ల మార్క్ కామెడీ సన్నివేశాలతో రూపొందనుందని తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram charan  Kona Venkat  Tweets  Rakul preet singh  

Other Articles