Actor Mithun Chakraborty | health news

Actor mithun chakraborty health news

Mithun Chakraborty health news, Mithun Chakraborty health updates, Mithun Chakraborty latest news, Mithun Chakraborty movie news, Mithun Chakraborty political news, Mithun Chakraborty news, Mithun Chakraborty songs, Mithun Chakraborty

Actor Mithun Chakraborty health news: Bollywood great actor Mithun Chakraborty was rushed to Raksha Hospital in Kandivali.

మిథున్ చక్రవర్తి ఆరోగ్యంగానే వున్నారట

Posted: 05/19/2015 09:50 AM IST
Actor mithun chakraborty health news

మిథున్ చక్రవర్తి అంటే తెలుగు ప్రేక్షకులకు అంత తెలుసో తెలియదో కానీ.. ఆయన నటించిన ‘అయమే డిస్కో డాన్సర్...’ పాట ఇప్పటికీ దుమ్ముధులుపుతోనే వుంది. ఈ పాట దేశవ్యాప్తంగా భారీగా క్రేజ్ వచ్చింది. కొన్ని సంవత్సరాల క్రితం నాటి పాట అయినప్పటికీ కూడా ఇప్పటికీ పలు కార్యక్రమాల్లో ఈ పాట హుషారెత్తిస్తోంది.

మిథున్ చక్రవర్తి తెలుగులో ఇటీవలే ‘గోపాల గోపాల’ సినిమాలో లీలాధర్ స్వామిజీ పాత్రలో నటించాడు. ఈ పాత్రకు హిందీ, తెలుగు రెండు భాషలలో ఆయనే నటించి, ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేసారు. తెలుగులో కూడా ఈ పాత్రకు ప్రేక్షకుల నుంచి భారీ ప్రశంసలే దక్కాయి.

అలాంటి బాలీవుడ్ అగ్ర నటుడు మిథున్ చక్రవర్తి ఇటీవలే అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదంటూ గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ విషయంపై మిథున్ చక్రవర్తి తనయుడు మహాక్షయ్ స్పందిస్తూ... తన తండ్రికి ఏం కాలేదని, కేవలం రోటీన్ చెకప్ లో భాగంగానే హాస్పిటల్ కు వచ్చినట్లుగా ఆయన తెలిపారు. అంతే కాకుండా ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే వున్నారని, ఇంట్లో సంతోషంగా వున్నారని మహాక్షయ్ చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mithun Chakraborty  health news  movie news  

Other Articles