R narayana murthy speech pawanism song launch

R Narayana Murthy Speech in Rey, Rey Pawanism Song Launched, R Narayanamurthy launch Rey Pawanism Song, R Narayanamurthy Pawanism Song, Rey Pawanism Song, Rey Pawanism Song release date, Rey Pawanism Song news, Rey Pawanism Song posters, Rey movie updates, Rey movie news, Rey posters, Rey songs

R Narayana Murthy Speech Pawanism Song Launch: Saidharam tej first movie Rey. Pawanism song released. R Narayanamurthy release this song.

నువ్వెప్పుడూ సీఎం అవుతావ్ పవన్ కళ్యాణ్: పీపుల్స్ స్టార్

Posted: 03/18/2015 04:17 PM IST
R narayana murthy speech pawanism song launch

ప్రశ్నించడానికే తప్ప పదవుల కోసం కాదంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జనసేన పార్టీ’ని స్థాపించి, ప్రజలకు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించిన పవన్ కళ్యాణ్ పై ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణ మూర్తి సూటిగా ఓ ప్రశ్నను సంధించాడు. ప్రశ్న అని అనడం కంటే... విజ్ఞప్తి చేసారు అని అనడం బాగుంటుందేమో.

అసలు విషయం ఏమిటంటే... ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘రేయ్’. సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం ‘పవనిజం’ అంటూ ఓ స్పెషల్ సాంగ్ ను ప్రమోషనల్ సాంగ్ గా కంపోజ్ చేసారు.

ఈ పాటను ప్రముఖ నటుడు, దర్శకుడు పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి చేతుల మీదుగా నిన్న సాయంత్రం విడుదల చేసారు. ఈ సంధర్భంగా నారాయణ మూర్తి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్, చిరంజీవి, సాయిధరమ్ తేజ లతో పాటు అతిథిగా విచ్చేసిన వి.వి.వినాయక్ లపై ప్రశంసల వర్షం కురిపించారు.

రజనీకాంత్ లో వుండే అట్రాక్షన్, ఎలక్ట్రిఫయ్యింగ్, చిరంజీవిలోని చరిష్మా కలగలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయంలాంటి మహాభారత యుద్ధంలోకి మీరు దిగారు. దిగారు కాబట్టి... ఎవరో పాలనా వాళ్లు సిఎం పాలానా వరకు... అని చెప్పకండి! మీరెప్పుడూ సీఎం అవుతారు? వారి ఎజెండాయే పదవుల కోసం.. మరి మీ ఎజెండా ఏంటి? మరి పవన్ కళ్యాణ్ గారు మీ ఎజెండా ఏంటి? రాజకీయాల్లోకి దిగారు మీరు పోరాటం చేయండి... జనాల ఆశీస్సులు వుంటే మీరే సీఎం అవుతారు. మానవత్వం వుంది కాబట్టే పవన్ కళ్యాణ్ గురించి ఇపుడు మాట్లాడుకుంటున్నాం అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు.

Video source from idlebrainlive

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : R Narayana Murthy  Speech  Rey Pawanism Song  

Other Articles