Regina cassandra item songs liplock scenes sai dharam tej subramanyam for sale

regina cassandra news, regina cassandra photos, regina cassandra hot news, regina cassandra hot photo shoot, regina cassandra gallery, regina cassandra news, regina cassandra interview

regina cassandra item songs liplock scenes sai dharam tej subramanyam for sale : Regina cassandra did not want to dance in item songs.

లిప్ లాక్ కి ఓకే కానీ.. అది మాత్రం వద్దంటోంది!

Posted: 03/10/2015 07:13 PM IST
Regina cassandra item songs liplock scenes sai dharam tej subramanyam for sale

ఇండస్ట్రీలో ఈమధ్య ఐటమ్ సాంగులకు క్రేజ్ బాగానే పెరిగిపోయింది. అందుకే.. స్టార్ హీరోయిన్లు సైతం ఐటమ్ పాటల్లో నృత్యించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఈ విషయంలో శృతిహాసన్ చాలా ముందుంది. ఓవైపు హీరోయిన్ గా సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు ఇతర మూవీల్లో ఐటమ్ సాంగుల్లో స్టెప్పులేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది ఈ భామ! ఈమెలాగే చాలామంది తారలు కూడా ‘ఐటమ్’ సాంగుల్లో తమ హోయలొలికించినవాళ్లు వున్నారు. అయితే.. తాను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఐటమ్ సాంగులు చేయనని తెగేసి చెబుతోంది రెజీనా!

వరుస సినిమాలు సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న రెజీనా.. ఇప్పటివరకు నటించిన సినిమాలన్నింటిలోనూ ‘లిప్ లాక్’ సీన్లలో నటించింది. అలాగే హాట్ సన్నివేశాల్లో కనిపించి కుర్రకారును మత్తెక్కించింది కూడా! అయితే.. రవితేజలాంటి హీరోతో నటించినప్పటికీ ఈమెకు మాత్రం స్టార్ స్టేటస్ ఇంకా రాలేదు. దీంతో చిన్నహీరోల సినిమాల్లోనే కంటిన్యూ అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐటెం సాంగుల్లో నటించనంటూ తేల్చి చెప్పింది. ఇంటర్వ్యూ సందర్భంగా ఓ మీడియా పర్సన్.. ‘మీరు ఐటమ్ సాంగుల్లో నటిస్తారా..?’ అని అడగగా.. తాను అటువంటి పాటలు చేయనంటూ చెప్పింది. అలాంటి సాంగుల్లో నటిస్తే తన ఇమేజ్ దెబ్బతింటుందన్న అభిప్రాయాన్ని వెల్లడిస్తోంది.

ఈ నేపథ్యంలోనే రెజీనా మాట్లాడుతూ.. ‘ప్రస్తుతానికి ఐటెం పాటలు చేయకూడదని డిసైడ్ అయ్యాను. కథానాయిక పాత్రలే చేస్తాను’ అని అంటోంది. ఇంకా హీరోయిన్ గా సెటిలవ్వని ప్రస్తుత తరుణంలో ఐటెం సాంగులకు ఓకే చెబితే.. తన రేంజి పెరగదని అమ్మడు భావిస్తోందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదిలావుండగా.. ప్రస్తుతం ఈ అమ్మడు సాయి ధరమ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాలో నటిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : regina cassandra  telugu item songs  heroines item songs  

Other Articles