Jr ntr fans attack on temper theater

Jr NTR fans attack on Temper Theater, NTR fans attack on Temper Theater in Tirupati, NTR fans attack on Temper Theater, Jr NTR fans attack on Temper Theater, NTR fans attack on Temper, Temper movie latest news, Temper movie stopped, Temper movie stills, Temper movie review, Temper telugu review, Temper movie updates, Temper hungama, Temper

Jr NTR fans attack on Temper Theater: Young tiger ntr latest movie temper. temper movie worldwide released today. puri jagannadh direction.

ఎన్టీఆర్ అభిమానులు దాడి... థియేటర్ అద్దాలు ధ్వంసం!

Posted: 02/13/2015 02:54 PM IST
Jr ntr fans attack on temper theater

పూరీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, కాజల్ జంటగా నటించిన తాజా చిత్రం ‘టెంపర్’. పరమేశ్వర ఆర్ట్ ప్రోడక్షన్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ సంగీతం అందించాడు. ఇటీవలే విడుదలైన పాటలకు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం నేడు (ఫిబ్రవరి 13) ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. తెల్లవారుజాము నుంచే బెన్ఫిట్ షోలతో ప్రారంభమైన ఈ సినిమా పాజిటివ్, హిట్ టాక్ తో నడుస్తోంది. ఇలాంటి సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులే తాజాగా దాడి చేసారు.

అయితే ఈ సినిమా ప్రదర్శించబడుతున్న ఓ థియేటర్ పై ఎన్టీఆర్ అభిమానులు విసిరారు. థియేటర్ అద్దాలను ధ్వంసం చేసారు. దీంతో పరిస్థితి గందరగోళంగా మారింది. తిరుపతిలో ‘టెంపర్’ సినిమా ప్రదర్శించబడుతున్న జయస్యామ్ అనే థియేటర్పై గురువారం ఉదయం ఎన్టీఆర్ అభిమానులు దాడికి పాల్పడ్డారు. తిరుపతిలో ఎన్నికలు జరుగుతున్నందువల్ల ఎన్నికల కోడ్ ఆదేశాల ప్రకారం ‘టెంపర్’ సినిమాను థియేటర్ యాజమాన్యం ప్రదర్శనను రద్దుచేసింది.

దీంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. తమ కోసం ‘టెంపర్’ సినిమాని ప్రత్యేకంగా ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. కానీ ఇందుకు థియేటర్ యాజమాన్యం నిరాకరించింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ రాళ్ల దాడికి చేసి, థియేటర్ అద్దాలను ధ్వంసం చేసారు. ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో... చివరకు పోలీసులు రంగంలోకి దిగి, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  fans  attack  Temper  Theater  Tirupati  Puri jagannadh  

Other Articles