Renu desai tweets on unknown persons

renu desai tweets on unknown persons, renu desai angry on unknown persons, renu desai tweets on unknown persons comments, Renu desai tweets on relationship with Pawan kalyan, Renu desai tweets on relationship, Renu desai tweets on Pawan kalyan, Renu desai tweets, Renu desai latest tweets, Renu desai latest news, Renu desai comments on pawan kalyan, Renu desai latest updates, Renu desai pawan kalyan, Renu desai

renu desai tweets on unknown persons: Renu desai latest tweets about unknown persons abuse tweets and comments. Renu desai latest tweets, stills, comments, movies, gallery

దమ్ముంటే ఒరిజినల్ ఫోటో, పేరు పెట్టు

Posted: 02/13/2015 01:28 PM IST
Renu desai tweets on unknown persons

రోజురోజుకి రేణుదేశాయ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతోంది. సినీనటుడు పవన్ కళ్యాణ్ తో విడాకులయ్యాక... రేణుదేశాయ్ పిల్లలతో కలిసి వేరుగా వుంటున్న విషయం తెలిసిందే. అయితే రేణుదేశాయ్ మాత్రం తరచూ ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతుంది.

ఇటీవలే పవన్ కళ్యాణ్ మంచి తండ్రి కాడంటూ కొంతమంది ఆకతాయిలు సోషల్ మీడియాలోని రేణు దేశాయ్ అకౌంట్ లో విమర్శలు చేయడంతో... రేణు ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు శాంతంగా చెప్పుకొచ్చిన రేణు... ఇలా ఒక్కసారిగా ఘాటుగా స్పందించడంతో... రేణు ఫాలోవర్స్ కూడా షాకయ్యారు.

అయితే తాజాగా మళ్లీ రేణు తన కామెంట్లతో హాట్ టాపిక్ గా నిలిచింది. కొంతమంది ఆకతాయిలను ఉద్దేశించి రేణు... పనికిరాని వాళ్ళు అందరూ ట్విట్టర్లో చేరి సెలబ్రిటీలను తిట్టడానికి, కామెంట్ చేయడానికి సిద్దమైపోతారు. వాళ్లకు తమ ఒరిజినల్ పేర్లు, ఫోటోలు ట్విట్టర్లో పెట్టుకునే దమ్ము లేదు. మొదట మీ నిజమైన పేర్లు, ఫోటోలు పెట్టడండి. ఆ తర్వాత మమ్మల్ని పేస్ చేయండి. నిజ జీవితంలో సెలబ్రిటీలకు 10 కిలోమీటర్ల దూరం వరకు రాలేని వీళ్ళకు.. ట్విట్టర్, పేస్ బుక్ వంటి సోషల్ మీడియా సైట్లలో మాత్రం నోరు బాగా లేస్తుంది. అంటూ రేణు ఘాటుగా స్పందించింది.

రేణు చేసిన కామెంట్లకు భారీగానే రెస్పాన్స్ వస్తోంది. రేణుకు చాలా మంది మద్ధతు పలుకుతున్నారు. మరి అటు నిజజీవితంలో సామాన్య ప్రజల కోసం పవన్ పోరాడుతుంటే... సోషల్ మీడియాలో రేణు ఇలా ఘాటుగా కామెంట్లు చేస్తూ స్పందించేస్తోంది. మరి రేణు ఇలా ఇంకెంత కాలం కామెంట్లు చేయనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Renu desai  angry  Pawan kalyan  Tweets  Relationship  Movie News  Tollywood  

Other Articles