Anushka shetty allu arjun rana daggubati guna sekhar rudamadevi movie release date

anushka shetty news, anushka shetty rudramadevi movie, rudramadevi movie release date, rudramadevi movie news, rudramadevi guna sekhar, anushka shetty, rudramadevi release date, allu arjun gona ganna reddy, rana daggubati

anushka shetty allu arjun rana daggubati guna sekhar rudamadevi movie release date : rudramadevi movie unit planning to release movie in march.

గ్రీష్మతాపాన్ని పెంచుతున్న అనుష్క.. నాకేం తెలియదంటున్న బన్నీ..

Posted: 01/24/2015 08:03 PM IST
Anushka shetty allu arjun rana daggubati guna sekhar rudamadevi movie release date

అందాల ఆరబోతతో తానూ హాట్ భామనేనంటూ చెప్పకనే చెబుతున్న మూడుపదుల సెక్సీనటి అనుష్క.. ఈసారి సమ్మర్ హీట్’ను మరింతగా పెంచేందుకు సన్నద్ధమవుతుంది. గతంలో ఎన్నడూలేని విధంగా ప్రేక్షకులను అలరించేందుకు ఈ అమ్మడు అన్నీ ఏర్పాట్లను సిద్ధం చేసుకుంది. అయితే.. ఈ వ్యవహారంలో బన్నీ మాత్రం కాస్త సైలెంటుగానే వున్నాడు. తనకేం తెలియదన్నట్లుగా నటిస్తున్నాడు.

అసలు విషయం ఏమిటంటే.. అనుష్క మెయిన్ లీడ్ రోల్’లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రుద్రమదేవీ’ చిత్రాన్ని వచ్చే వేసి తొలినాళ్లలో అంటే.. మార్చి చివరి వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశంలో తొలిసారిగా స్టీరియోస్కోపిక్‌ త్రీడీ విధానంలో రూపొందుతున్న ఈ మూవీ చిత్రీకరణను సరిగ్గా రెండేళ్ల క్రితం వసంతపంచమి పర్వదినాన వరంగల్లులోని వేయిస్థంభాల గుడిలో ప్రారంభమైంది. దాదాపు 45 కోట్ల భారీ వ్యయంతో రూపొందిన ఈ చిత్రాన్ని గుణా టీమ్ వర్క్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

నాటి సంప్రదాయాలు, జీవన స్థితిగతులను ప్రతిబింబించేలా చిత్రబృందం ఎంతో శ్రమిస్తోంది. ఈ తరం ప్రజలకు అర్థమయ్యే విధంగా వీరవనిత రుద్రమదేవీ కథనాన్ని ఎంతో హుందాగా తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ.. ప్రస్తుతం డబ్బింగ్, గ్రాఫిక్ వర్క్స్’ను ముగించిన అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని శరవేగంగా జరుపుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ చిత్రాన్ని మార్చి చివరివారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని బృందం యత్నిస్తోంది.

ఈ మూవీని నిర్మిస్తూ, తెరకెక్కిస్తున్న గుణశేఖర్.. ఈ చిత్రంపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతంలో ఈయన తీసిన చిత్రాలు ఘోరపరాజయం కావడంతో కాస్త గ్యాప్ తీసుకున్నారు. అయితే.. రీఎంట్రీ గ్రాండ్’గా వుండాలన్న ఉద్దేశంతో ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎంత ఖర్చైనా భరిస్తూ ఆయన రూపొందిస్తున్న ఈ చిత్రమే తన భవిష్యత్తును నిర్ణయిస్తుందని గట్టి నమ్మకంతో వున్నారు. ఇక అనుష్క కూడా ఈ చిత్రంపై ఎక్కువ అంచనాలు పెట్టుకుంది. అలాగే ఈ చిత్రంలో రానా నిడదవోలు చాళుక్యరాజుగా నటిస్తున్న రానా సైతం ఈ మూవీపై ఆశలు పెట్టుకున్నాడు. టాలీవుడ్’లో ఒక్క సోలో హిట్ దొరకొకపోవడంతో ఈ మూవీపై అంచనాలు పెంచుకున్నాడు. ఈ చిత్రం హిట్ అయితే తన కెరీర్ మలుపు తిరుగుతుందని భావిస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్రలో కనువిందు చేస్తున్నారు.

అంతేకాదు.. గణపతిదేవునిగా - కృష్ణంరాజు, శివదేవయ్యగా - ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా - సుమన్, మురారిదేవునిగా - ఆదిత్యమీనన్, నాగదేవునిగా - బాబా సెహగల్, కన్నాంబికగా - నటాలియాకౌర్, ముమ్మడమ్మగా - జరాషా, మదనికగా - హంసానందిని, అంబదేవునిగా - జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా - అదితి చంగప్ప, కోటారెడ్డిగా - ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా - వేణుమాధవ్, ప్రసాదాదిత్యగా - అజయ్ కనిపించనున్నారు. ఇళయరాజా స్వరపరిచిన ఈ చిత్రానికి ఎంతోమంది సాంకేతిక నిపుణులు పనిచేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka shetty  rudramadevi movie updates  allu arjun  rana daggubati  

Other Articles