Nithin on pawan kalyan in chinnadana neekosam audio release

nithin comments on pawan kalyan, nithin latest comments on pawan kalyan, nithin on pawan in chinnadana neekosam audio release, chinnadana neekosam audio release photos, chinnadana neekosam songs, chinnadana neekosam songs rating and review, chinnadana neekosam latest photos trailers teasers, chinnadana neekosam release date, nithin marriage latest news, tollywood latest news updates

nithin on pawan kalyan in chinnadana neekosam audio release : hero nithin says that he is hardcore pawan kalyan fan, as a fan power star will placed in his heart, one of pawan kalyan fan presented a photo of pawan kalyan and nithin to nithin in chinnadana nee kosam audio release

పవన్ పై గుండెలోతుల్లో అభిమానం

Posted: 11/28/2014 10:17 AM IST
Nithin on pawan kalyan in chinnadana neekosam audio release

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పరమభక్తులు చాలా మందే ఉన్నారు. అభిమానులంతా దేవుడిగా భావించే పవన్ కు సినిమా హీరోల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. యువ హీరో నితిన్ కూడా పవన్ భక్తుల్లో ఒకరు. తాను పవన్ ఫ్యాన్ అని గతంలోనే ఎన్నోసార్లు చెప్పుకున్న నితిన్.. తాజాగా ‘చిన్నదాన నీకోసం’ ఆడియో రిలీజ్ సందర్బంగా మరోసారి పవన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాకుండా ఓ అభిమాని పవన్, నితిన్ కలిసి ఉన్న ఫొటోను నితిన్ కు బహుకరించగా ఫోటోను ముద్దాడి అభిమానం చాటుకున్నాడు.

పవన్ ఫొటో ఎక్కడ పెట్టుకుంటారని ఫ్యాన్స్ ప్రశ్నించగా.,,. ‘నా గుండెల్లో’ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ అంతా జై పవన్ అంటూ శిల్పకళా వేదిక ఆడిటోరియంను హోరెత్తించారు. కార్యక్రమంలో మాట్లాడిన హీరో నితిన్.., ‘అభిమానులు లేకపోతే ఏ హీరో లేడన్నారు’. ఫ్లాపులు, హిట్లు అనే తేడా లేకుండా ఫ్యాన్స్ ఎప్పుడూ అండగా ఉంటారని గుర్తు చేసుకున్నారు. ఈ మూవీ కోసం తాను పడిన కష్టాలను వివరించాడు. ఓ పాట ప్రాక్టీస్ సమయంలో కాలు బెనకటంతో సరిగా డాన్స్ చేయలేకపోయినందుకు ఫ్యాన్స్ క్షమించాలని కోరాడు.

‘చిన్నదాన నీకోసం’ ఆడియో గురువారం సాయంత్రం విడుదల అయింది. నితిన్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో మిస్తీ చక్రవర్తి హీరోయిన్ గా నటిస్తోంది. కరుణాకరన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను నితిన్ అక్క నిఖితా రెడ్డి నిర్మిస్తున్నారు. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై వస్తున్న ఈ మూవీ హ్యాట్రిక్ హిట్ అందిస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithin  pawan kalyan  chinnadana neekosam  audio release  

Other Articles