Nagarjuna to act in komaram bheem life story movie

nagarjuna in komaram bheem biopic movie, nagarjuna as komaram bheem, nagarjuna acting in telangana komaram bheem movie, komaram bheem real life biopic, komaram bheem biopic movie by nagarjuna, tollywood latest news updates, telangana freedom fighters, komaram bheem life

nagarjuna to act in komaram bheem life story movie : film nagar rumors that if all comes possible senior romantic and popular hero of tollywood nagarjuna may act as komaram bheem real life story.

తెలంగాణ రుణం తీర్చుకునే టైమ్ మళ్ళీ వస్తోంది

Posted: 11/28/2014 01:28 PM IST
Nagarjuna to act in komaram bheem life story movie

రొమాంటిక్ హీరోగా పేరున్న నాగార్జున, ప్రయోగాత్మక సినిమాలు చేయటంలో తానే కింగ్ అని నిరూపించుకున్నాడు. లవ్, యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూనే వినూత్నమైన కథలుండే సినిమాలు చేసి హిట్ కొట్టిన ట్రాక్ రికార్డు నాగ్ సొంతం. ఫిలింనగర్ వర్గాల తాజా సమాచారం ప్రకారం.., నాగార్జున త్వరలోనే తెలంగాణ ఉద్యమకారుడి జీవిత చరిత్ర సినిమాలో నటిస్తాడని తెలుస్తోంది. తెలంగాణలో నిజాంపై గెరిల్లా పోరు నడిపిన పోరాట యోధుడు ‘కొమరం భీం’ జీవితం నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కుతుందని తెలుస్తోంది.

ఈ మూవీ గురించి ఓ సీనియర్ డైరెక్టర్ నాగార్జునను కలిసి చర్చలు జరిపారని పుకార్లు వస్తున్నాయి. నాగార్జునను కలిసిన సీనియర్ డైరెక్టర్ భీమ్ కథ విన్పించగా., అంతగా ఆసక్తి చూపలేదట. అయితే ఎలాగైనా ఒప్పించి ప్రాజెక్టు చేస్తారని అంటున్నారు. తెలంగాణ యాస నేపథ్యంగా ఆ మద్య వచ్చిన ‘రాజన్న’ అనే సినిమాలలో నాగ్ నటించారు. ఈ మూవీ హిట్ కాకపోయినా.., పలు విభాగాల్లో నంది అవార్డులు మాత్రం వరించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారుడి జీవితగాధ సినిమాపై నాగార్జున ఆసక్తి చూపించే అవకాశం ఉంది. ‘కొమరం భీమ్’ తెలంగాణకు చెందిన వ్యక్తి అయినా.., నాగ్ నటిస్తే రెండు రాష్ర్టాల ఫ్యాన్స్ చూస్తారనే ఆయన్ను సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా గతంలో అన్నమయ్య స్టోరీ చెప్పినపుడు కూడా మొదట్లో నాగ్ వద్దన్నాడు.., కాని ఆ తర్వాత సినిమా తీయటం, సూపర్ హిట్ కావటం తెలిసేందే. అదేవిధ:గా ‘కొమరం భీమ్’ కూడా మంచి పేరు వస్తుందని అంటున్నారు. ప్రస్తుతం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ అనే సినిమాలో నాగార్జున నటిస్తున్నాడు. దీంతో పాటు ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ సెకండ్ సెషన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. కొమరం భీమ్ ప్రాజెక్టు ఓకే అయినా షూటింగ్ ప్రారంభించేందుకు చాలా సమయం పడుతుందని తెలుస్తోంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nagarjuna  komaram bheem  telangana  movie  freedom fighters  

Other Articles