బాలల దినోత్సవం.. అంటే బాలలకు ఎంతో ఇష్టం.. దేశ ప్రధమ ప్రధాని చాచా నెహ్రూకు చిన్నారి బాలబాలికలంటే ఎంతో ఇష్టమని ఆయన తన జన్మదినాన్ని బాలలు దినోత్సవంగా జరుపుకోవాలని నిశ్చయించడంతో..అనాటి నుంచి నవంబర్ 14 వచ్చిందంటే చాలు సంబరాలు జరుపుకుంటారు బాలబాలికలు. ఇక పాఠశాల్లలో అయితే చిన్నారుల కోసం ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి వారిని సంతోషపెడతారు. విద్యార్థులకు చాక్లెట్ లు పంచుతారు. విద్యార్థులతో కలసి ఉపాధ్యయులు ఫోటోలు కూడా తీసుకుంటారు. ఇది ప్రతీ పాఠశాలలోనూ జరిగే వేడుక.
కానీ ఈ ఫోటోలో కనబడుతున్న బుజ్జాయ్ ఎవరో తెలుసా..? ముద్దుగారే యశోదా ముంగిట ముత్యము వీడు.. అని అలపిస్తున్న గానాన్ని పక్కన బెట్టి నెహ్రూ గారి చిన్ననాటి ఫోటో అంటారా..? మీరు పొరబడుతున్నారు. అతను చిన్ననాటి ఛాఛా నెహ్రూ కాదు. మీరు అలా అనుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదు. బాలల దినోత్సవం రోజున.. అందులోనూ శాంతికి ఆలవాలమైన శ్వేతవర్ణ దుస్తులు ధరించి.. ఎర్రటి గులాబి పెట్టుకుని ముద్దులొలికే బోసి నవ్వులు చిందిస్తుంటే.. ఎవరు మాత్రం పొరబడరు.. ఛాఛా గారంత ఎత్తుకు ఎదగుతానని ఇప్పుడే సింబాలిక్ గా చెబుతున్న ఈ బుజ్జాయి మిస్టర్ ఫర్ఫెక్ట్ అల్లు అర్జున్ (బన్ని) గారాల పట్టి. అల్లు గారి వంశంలో వరుసగా తరానికి తరానికి సంక్రమిస్తున్న పుత్రోత్సాహం.. బన్నికి కూడా కలగాలని ఆశిస్తూ.. బుల్లి చాచా అయాన్ కి బెస్ట్ విషెస్ చెబుదాం...
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more