Tollywood star heroines targets anisha ambrose by gabbarsingh2 offer

anisha ambrose latest news, anisha ambrose photos, anisha ambrose in gabbarsingh2, anisha ambrose pawan photos, gabbarsingh2 latest updates, gabbarsingh2 shooting schedule, gabbarsingh2 heroine name, gabbarsingh2 cast and crew, tollywood latest updates, telugu heroins, tollywood heroines remunerations

tollywood star heroines targets anisha ambrose by gabbarsingh2 offer : anisha ambrose become target for all tollywood heroines by her heroine role in gabbarsingh2 movie. anisha ambrose gives shock to all heroins by getting heroine chance in gabbarsingh2 movie

ఒక్క చాన్స్ తో అందరికీ టార్గెట్ అయింది

Posted: 11/14/2014 01:07 PM IST
Tollywood star heroines targets anisha ambrose by gabbarsingh2 offer

అనుకోని, ఊహించని సంఘటనలు జరిగితే అంతా షాక్ అవుతారు. కాని అనీషా మాత్రం టార్గెట్ అయింది. ‘గబ్బర్ సింగ్2’ మూవీలో హీరోయిన్ ఆఫర్ కొట్టేసి అమ్మడు టాలీవుడ్ కు టార్గెట్ అయింది. ఎంతోమంది స్టార్ హీరోయిన్లు, తమ బిజీ షెడ్యూల్ ను ఈ సినిమా కోసం సర్దబాటు చేసుకునేందుకు, అవసరమైతే వేరే చాన్సులు వదులుకునేందుకు సిద్దంగా ఉన్నారు. పవన్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. అయితే అనుకోకుండా.., ఎవరూ ఊహించలేనట్లుగా తెలుగమ్మాయి అనిషా అంబ్రోస్ ‘గబ్బర్ సింగ్2’ అని సంచలన ప్రకటన బయటకు వచ్చింది.

అప్పటివరకు అంతగా ప్రచారంలో లేని అనీషా.. ఒక్కసారిగా పాపులర్ అయింది. ఎంతలా అంటే అమ్మడి ఫేస్ బుక్ పేజికి గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం ఉదయం వరకు మూడు వేలకు పైగా లైకులు వచ్చాయి. దీనికి తోడు ఇప్పుడంతా ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. అసలు ఈ సినిమాలో ఎలా సెలక్ట్ అయింది. ఇందుకు కారణాలేమిటి అని టాలీవుడ్ లో హాట్ చర్చలు సాగుతున్నాయి. హీరోయిన్లు అయితే దీనిపై బిగ్ డిస్కషన్లు నడుపుతున్నారు. అనీషను ఎందుకు తీసుకున్నాడు. మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు అని తమను తాము ప్రశ్నించుకుంటున్నారట.

ఇలా సైలెంట్ గా వచ్చి.., సునామీ సృష్టించిన అంబ్రోస్ మొత్తానికి పవన్ సినిమా హీరోయిన్ అయింది. గత నెలలో పవన్ ‘గోపాల గోపాల’ షూటింగ్ లో ఉండగా ఈ అమ్మడు వెళ్ళి కలిసి ఫొటో దిగింది. ఇది నెట్ లో అప్ లోడ్ చేసి.., ‘‘అభిమాన హీరో పవన్ ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది జీవితంలో మరువలేని రోజు’’ అని తెలిపింది. అయితే అప్పుడెవరూ ఈమె పవర్ స్టార్ పక్కన హీరోయిన్ లా నటిస్తుంది అనుకోలేదు. కాని అదృష్టం ఉంటే అ..,ఆ  రాకపోయినా అమెరికా వెళ్ళవచ్చు అనేందుకు అనిషా ఉదాహరణ.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anisha ambrose  gabbarsingh2  tollywood  latest news  

Other Articles