Krishna vamshi making movie with his wife ramya krishna

krishna vamshi hit movies, krishna vamshi ramyakrishna movie, krishna vamshi ramya krishna divorce, krishna vamshi ramyakrishna latest movie, tollywood latest news updates, telugu thriller movies

krishna vamshi making movie with his wife ramya krishna : tollywood family movies director krishna vamshi plans to make a movie with his wife ramyakrishna. krishna vamshi ready to direct a thriller movie with his wife ramyakrishna

రమ్యతో థ్రిల్లింగ్ అనుభవం ఇస్తాడట

Posted: 11/12/2014 04:12 PM IST
Krishna vamshi making movie with his wife ramya krishna

క్రియేటివ్ గా ఫ్యామిలి సినిమాలు తీసే డైరెక్టర్ గా పేరున్న క్రియేటివ్ కృష్ణవంశీ కొత్త సినిమా తీసేందుకు సిద్దమవుతున్నాడు. మరోసారి ప్రయోగం చేసి సక్సెస్ కొట్టాలని ఉవ్విళ్ళూరుతున్నాడు. ‘గోవిందుడు అందరివాడేలే’ తర్వాత ఖాళీగా ఉన్న కృష్ణవంశీ, ప్రస్తుతం ఓ థ్రిల్లర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీలో వంశీ భార్య రమ్యకృష్ణ హీరోయిన్ అని అంటున్నారు. కధను సిద్ధం చేసుకున్న క్రియేటివ్ డైరెక్టర్ త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. తెలుగు, తమిళ బాషల్లో సినిమా విడుదల చేస్తారని అంటున్నారు.

ఈ ఆలోచన వెనక చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ప్రస్తుతం టాలీవుడ్ లో థ్రిల్లర్ సినిమాల హవా నడుస్తుంది. థ్రిల్లర్ కాన్సెప్టుతో వచ్చిన చాలా సినిమాలు భారీ  కలెక్షన్లు వసూలు చేశాయి. దీంతో తాను కూడా ఈ ప్రయోగం చేస్తే ఫలిస్తుందని అనుకుంటున్నాడు. అటు పెళ్లి తర్వాత అప్పుడప్పుడూ తెరపై కన్పించిన రమ్యతో సినిమా తీస్తే, ఆమెకు మళ్ళీ కెరీర్ ఇచ్చినట్లు అవుతుంది. అంతేకాకుండా తమిళ ప్రేక్షకులకు స్మాల్ స్ర్కీన్ ద్వారా పరిచయం అయిన రమ్య, సిల్వర్ స్క్రీన్ ద్వారా కాసులు తీసుకొస్తుందని భావిస్తున్నాడు.

ఇంకా పట్టాలెక్కని ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్ అయితే క్రియేటరే.. కాని నిర్మాత ఎవరో ఇంకా తెలియట లేదు. అయితే కొందరు మాత్రం వంశీ స్వయంగా సినిమాను నిర్మిస్తాడు. అందుకే భార్యను హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తున్నాడు అంటున్నారు. ఈ థ్రిల్లింగ్ ప్రాజెక్టుపై మరింత సమాచారం త్వరలోనే మీకు అందిస్తాము.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : krishna vamshi  ramya krishna  latest news  tollywood  

Other Articles