Balakrishna and mahesh babu latest movie leaked photos

mahesh babu koratala shiva movie news, mahesh babu latest movie title, mahesh babu next movie, mahesh babu with sruti hassan latest updates, balakrishna lion movie updates, balakrishna trisha movie latest news, balakrishna selfie with trisha, tollywood latest news updates, popular and crazy funny selfie photos

balakrishna and mahesh babu latest movie photos : balakrishna acting in sathyadeva movie title named lion heroine trisha posted her selfie with balakrishna creating halchal in internet. mahesh babu in pune with koratala shiva and sruti hassan for latest movie shooting some one posted shooting photo getting popular

బాలయ్య, మహేష్ ఫస్ట్ లుక్ (ఫొటోలు)

Posted: 11/12/2014 03:41 PM IST
Balakrishna and mahesh babu latest movie leaked photos

బాలకృష్ణ, మహేష్ బాబు ఫస్ట్ లుక్ ఫొటోలు అనగానే.., వీరిద్దరూ కలిసి సినిమా ఎప్పుడు మొదలు పెట్టారు. కనీసం గాసిప్ కూడా రాలేదే అని ఆశ్చర్యపోకండి. ఈ ఫొటోలు ఇద్దరి వేర్వేరు సినిమాలకు సంబంధించినవి. ప్రస్తుతం బాలకృష్ణ సత్యదేవ డైరెక్షన్ లో ‘లయన్’ (పేరు ఖరారు కాలేదు’ అనే సినిమాలో నటిస్తు్న విషయం తెలిసిందే. పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్న బాలకృష్ణ, సినిమాలో ఎలా ఉంటాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే త్రిష, బాలయ్య ఫస్ట్ లుక్ ను బయట పెట్టింది.

మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న త్రిష, బాలకృష్ణతో కలిసి సెల్ఫీలు దిగింది. ఇందులో వెరైటీగా పోజులిచ్చాడు. ఈ ఫొటోలను త్రిష ఆన్ లైన్ లో పెట్టేసింది. దీంతో ‘లయన్’ సినిమాలో బాలయ్య కన్పించే ఓ సీన్ బయటకు వచ్చిందన్నమాట. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆడియో త్వరలోనే విడుదల చేస్తామని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. ఎస్.ఎల్.వి. ప్రొడక్షన్స్ తో రుద్రపాటి రమణారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

balakrishna-and-Shruti

ఇక కొరటాల శివ డైరెక్షన్ లో మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం పూణేలోజరుగుతోంది. అక్కడ షూటింగ్ చూసేందుకు వచ్చిన చాలామంది తెలుగు ప్రజలు మహేష్, శృతి హాసన్ ఫొటోలను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇవి మహష్ తాజా చిత్రం ఫస్ట్ లుఖ్ పేరుతో తెగ హల్ చల్ చేస్తున్నాయి. ‘ఆగడు’ ఫ్లాప్ తర్వాత వస్తున్న ఈ మూవీలో మహేష్ కొత్తగా కన్పిస్తాడు అని టాక్ విన్పిస్తోంది. త్వరలోనే పూణే షూటింగ్ పూర్తి చేసుకుని మూవీ యూనిట్ హైదరాబాద్ వచ్చేస్తుందని చెప్తున్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : balakrishna  mahesh babu  trisha  sruti hassan  selfie  

Other Articles