Gopala gopala movie gets big price for nizam distribution

gopala gopala release date, gopala gopala latest news, gopala gopala latest photos, gopala gopala distribution, gopala gopala pawan kalyan photos, tollywood latest news, bollyw0od news

gopala gopala movie gets big price for nizam distribution : before going to complete shooting of the movie gopala gopala getting huge expectation and response. gopala gopala picked for a whopping 14 Crore on Non Refundable Advance by Rao & San (Prasanth) films

సంక్రాంతికి ముందే గోపాలుడికి పండగ

Posted: 11/04/2014 04:05 PM IST
Gopala gopala movie gets big price for nizam distribution

పవర్ స్టార్ తాజా సినిమా ‘గోపాల గోపాల’ విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ.., నైజాం డిస్ర్టిబ్యూషన్ భారీ రేటు పలికినట్లు టాక్ వస్తోంది. రావ్ (ప్రశాంత్) వర్గం ఈ మూవీ డిస్ర్టిబ్యూషన్ తీసుకుందట. ఇందుకోసం రూ.14కోట్లను అడ్వాన్స్ గా చెల్లించిందట. అయితే సినిమా డిస్ర్టిబ్యూషన్ పై ఇంకా ఒప్పందాలు జరగకముందే ఈ అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డిస్ర్టిబ్యూషన్ సమయంలో సినిమాపై అంచనాలు తగ్గినా ఈ డబ్బు వారికి తిరిగి ఇవ్వకుండా అగ్రిమెంట్ చేసుకున్నారట.

గతంలో ‘తుఫాన్’, ‘ఒంగోలు గిత్త’ సినిమాలను పంపిణీ చేసి చేతులు కాల్చుకున్న ప్రశాంత్ తాజా ప్రాజెక్టుపై మాత్రం భారీగా ఆశలు పెట్టుకున్నారు. పవన్ కు ఉన్న పాపులారిటి, వెంకి తో మల్టీస్టారర్ సినిమా దీనికి తోడు కధ బాలీవుడ్ లో సూపర్ హిట్ కావటంతో తెలుగులోనూ విజయం సాధించటం ఖాయమనే ధీమాతో కొన్నట్లు తెలుస్తోంది. ఇక నైజాంలో కొద్దికాలంగా థియేటర్లపై దృష్టి తగ్గించిన సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను వీరికే ఇచ్చే అవకాశముంది. అయితే సీడెడ్ మాత్రం ప్రాడక్షన్ హౌజ్ చేతుల్లోనే ఉంటుందని తెలుస్తోంది.

ప్రస్తుతం 90శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా..,, త్వరలోనే కాశీలో షూటింగ్ జరుపుకోనుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతాయని సినిమా యూనిట్ వర్గాలు తెలిపాయి. బాలీవుడ్ లో హిట్ అయిన ‘ఓ మై గాఢ్’ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. డాలి కిశోర్ డైరెక్ట్ చేస్తుండగా శరత్ మరార్ తో కలిసి సురేష్ నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ నెల చివర్లో ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని తెలుస్తోంది. టాలీవుడ్ లో విడుదలకు ముందే సంచలనాలు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలా ఉంటుందో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopala gopala  pawan kalyan  distribution  latest news  

Other Articles