Sneha ullal as halloween

sneha ullal next movie, sneha ullal salman khan movies, sneha ullal telugu movie, salman khan next movie, bollywood latest news, tollywood latest news, halloween photos, halloween movies

sneha ullal as halloween : heroine sneha ullal turned as halloween she is doing a movie with salman khan in bollywood. sneha ullal taking more care in movies with the effect of her previous projects

ఈమెవరో చెప్పకొండి చూద్దాం (ఫొటొ)

Posted: 11/04/2014 01:40 PM IST
Sneha ullal as halloween

కాస్త వెరైటిగా కన్పిస్తే చాలు వెంటనే పాపులారిటి వచ్చేస్తుంది. ఇక సినిమా హీరోయిన్లు కొంచెం డిఫరెంట్ గా ఏం చేసినా అదో సెన్సేషన్ అవుతుంది. అలాంటిదే ఈ ఫొటో కూడా. ప్రస్తుతం ఇంటర్నెట్ లో తెగ షేర్ అవుతున్న ఫొటో ఇది. అందాల సుందరి భయపెడితే ఎలా ఉంటుందో ఈ ఫొటో చూస్తే తెలుస్తోంది. ఈమె ఎవరో మేం చెప్పకుముందే గుర్తుపట్టగలరా...? చూద్దాం. ఇక తెలుగులో ఈ అమ్మడు పలు సినిమాలు చేసింది. వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని పెద్దగా ఆడలేదు. మామూలు స్టార్లతో పాటు పెద్ద హీరోతో చేసినా కూడా పంట పండలేదు.

మన పక్కన ఉన్న కోలీవుడ్ లో కూడా ఈ భామ కన్పించింది. అయితే అక్కడ కూడా కాలం కలిసి రాలేదు. ఇక తన అదృష్టాన్ని బాలీవుడ్ లో కూడా ప్రయత్నించి చూసింది. అక్కడ ఓ పెళ్లికాని వ్యక్తి పిలిచి సినిమా ఇచ్చాడు. అయితే ఎందుకో కాలం కలిసి రాలేదు. దీంతో మళ్ళీ కెరీర్ ఎటు అనే ఆలోచనలో పడింది. ఈ లోపే విశాల మనస్సున్న వ్యక్తి మరోసారి పిలిచి సినిమా ఆఫర్ ఇచ్చాడు. దీంతో ఈసారి తానేంటో నిరూపించుకోవాలని డిసైడ్ అయిందట. ఇందుకోసం సార్ చెప్పినట్లు జిమ్ చేయటమే కాకుండా బెల్లి డాన్స్ చేస్తోందట. గత అనుభవాన్నంతా రంగరించి కొత్త రుచి చూపిస్తా అని ధీమాగా చెప్తోంది.

ఓ వైపు చూస్తే మందాకినిలా మరో యాంగిల్ లో ఐశ్వర్యలా ఉంటుందీ గుమ్మ. ఇఫ్పటికీ ఈమె ఎవరో గుర్తు పట్టలేదా..  అయితే మేమే చెప్పేస్తున్నాం. ఈ అమ్మడు మన స్నేహ ఉల్లాల్. తెలుగులో ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’, ‘కరెంట్’, ‘సింహ’ వంటి సినిమాల్లో నటించింది. బాలీవుడ్ లో ‘లక్కీ.. నో టైం టు లవ్’ అనే సినిమాతో సల్మాన్ అవకాశం ఇచ్చాడు. అయితే ఆ మూవీ ఆడలేదు. అయినా సరే ఇప్పుడు మరోసారి చాన్స్ ఇస్తున్నాడు. దీంతో త్వరలోనే బాలీవుడ్ లో సినిమా చేయనుంది. ఇక ఈ ఫొటో విషయానికి వస్తే..., ఈ మద్య జరిగిన హాలోవిన్ పార్టికి హాజరయ్యేందుకు ఇలా రెడి అయి వచ్చిందట. అదీ స్నేహ ఫొటో మ్యాటర్.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sneha ullal  salman khan  halloween  latest news  

Other Articles