Samantha feeling very happy for the huge success off kaththi movie in tamilnadu

samantha latest news, samantha news, samantha kaththi movie, samantha hot photo shoot, samantha stills, samantha photos, samantha images, samantha pics, samantha movie news, samantha movie updates, kaththi movie news, kaththi movie collections

samantha feeling very happy for the huge success off kaththi movie in tamilnadu

తన చిరకాల వాంఛను తీర్చేసుకున్న సమంత!

Posted: 10/25/2014 04:29 PM IST
Samantha feeling very happy for the huge success off kaththi movie in tamilnadu

సాధారణంగా ఏ అమ్మాయికైనా సినిమాల్లో హీరోయిన్ గా నటించే అవకాశమొస్తే ఎగిరి గంతులేస్తుంది. ఇక అలాగే వరుసగా ఆఫర్లు వస్తూ.. స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోతే మాత్రం ఆమె ఆనందానికి ఇక హద్దులుండవు. కానీ ఇక్కడ సమంత వ్యవహారం మాత్రం కాస్త వేరేలా వుంది. నిజానికి ఈ అమ్మడు టాలీవుడ్ అగ్రకథానాయికల్లోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పదిలం చేసుకుంది. పైగా కొన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా వుండటంతోపాటు యాడ్ ల ద్వారా బుల్లితెర మీద తెగ సందడి చేసేస్తోంది. మొత్తానికి ఇటు వెండితెర, అటు బుల్లితెరలోనూ ఈ అమ్మడి హవా బాగానే కొనసాగుతోంది. ఇలా అన్నింటిలోనూ కలిపి ఈ గ్లామర్ డాల్ బ్యాంక్ అకౌంట్ లో బాగానే డబ్బులు జమ అయ్యాయి. అయితే ఇవేవి తనకు అంతగా సంతృప్తినివ్వడం లేదంటూ ఆమె తన భావాల ద్వారా వ్యక్తపరుస్తోందని టాలీవుడ్ టాక్!

ఎందుకంటే.. సమంత పుట్టినిల్లు తమిళనాడు! అక్కడి నుంచి వచ్చిన ఈ అమ్మడు టాలీవుడ్ లో స్టార్ డమ్ ను సంపాదించుకుంది కానీ.. తమిళంలో మాత్రం అది సాధ్యపడలేదు. ఇంతవరకు నటించిన తమిళ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర భారీగా బోల్తాపడినవే! దీంతో తన సొంత రాష్ట్రంలో తన స్టార్ డమ్ ను నిరూపించుకోలేకపోయానంటూ తెగ ఫీల్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ! ఈమధ్య భారీ అంచానల నడుమ విడులైన ‘‘అంజాన్’’ సినిమా ఒక్కసారిగా భరా అపరాజయం పొందడంతో తీవ్ర నిరాశకు గురైంది. ఆ సినిమాతో పెద్ద దెబ్బ తగలడంతో తమిళంలో సక్సెస్ అవ్వాలన్న తన చిరకాల వాంఛ ఇక ఎప్పటికీ కలగానే వుండిపోతుందని భయపడిందట ఈ అమ్మడు! అయితే ఇంతలోనే ఆమెకు ‘‘కత్తి’’ రూపంలో తిరిగి ఆనందం లభించిందని.. ఆ సినిమా ద్వారా తన చిరకాల వాంఛను తీర్చుకున్నానంటూ ఫుల్ ఖుషీలో వుందట ఈ అమ్మడు!

దీపావళి సందర్భంగా రిలీజైన ‘‘కత్తి’’ సినిమా మంచి హిట్టవడంతో సమంత చాలా హ్యాపీగా వుందని సమాచారం! తమిళనాటలో ఆ సినిమా కలెక్షన్లలో సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుండటంతో చాలా ఆనందంగా ఫీల్ అవుతోందట! ప్రస్తుతం అమెరికాలో వున్న ఈ చిన్నది.. కత్తి భారీ విజయం సాధించడంతో ఆ ఆనందాన్ని తన అభిమానులతో పంచుకుంటూ.. అందరికీ థ్యాంక్స్ చెప్పిందట ఈ భామ! ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇక తమిళంలో కూడా తన సత్తా చాటుకుందామని.. స్టార్ హీరోయిన్ గా పేరు నమోదు చేసుకోవాలని తెగ ఆరాటపడుతున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. సినిమా భారీ విజయం సాధించింది కానీ.. మరి ఈ మూవీ తమిళనాటలో ఆమె దశను ఎలా మార్చుతుందో చూడాలి మరి!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samantha  kaththi movie  tamilnadu news  telugu news  

Other Articles