Anushka shetty rejecting telugu movies but continuously accepting the tamil scripts

anushka shetty, anushka shetty latest news, anushka shetty hot photos, anushka shetty latest gallery, anushka shetty latest news, rudrama devi movie, rudrama devi news, rudrama devi movie release date, bahubali movie, bahubali movie news, anushka shetty rudrama devi movie, anushka shetty bahubali, tollywood news, telugu news

anushka shetty rejecting telugu movies but continuously accepting the tamil scripts

అనుష్క.. తెలుగుదర్శకులంటే అంత చిన్నచూపా?

Posted: 10/25/2014 04:22 PM IST
Anushka shetty rejecting telugu movies but continuously accepting the tamil scripts

‘‘అరుంధతి’’ చిత్రం ద్వారా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి.. అటువంటి తరహా సినిమాల్లో తను వుంటేనే చాలా బాగుంటుందనే మార్కును కొట్టేసింది ఈ మూడుపదుల భామ! అందుకే ఆ తరహాలో తెరకెక్కబోతున్న ‘‘రుద్రమదేవి’’, ‘‘బాహుబలి’’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకోసం ఎంతగానో శ్రమిస్తోంది అమ్మడు. గత ఏడాదికాలంగా ఈ సినిమాలకే ఎక్కువ డేట్స్ ను కేటాయించిన ఆమె.. గుర్రపుస్వారీ, కత్తి యుద్ధాలు వంటి కళలతోపాటు నాట్యంలోనూ శిక్షణ పొందుతోంది. ఇదిలావుండగా.. ఈ అమ్మడికి అన్ని చిత్రపరిశ్రమల్లోనూ మంచి గౌరవమే వుందికానీ.. టాలీవుడ్ లో మాత్రం ఇంకా ఎక్కువగానే వుందని చెప్పుకోవచ్చు. ఇతర తారలకు ఇవ్వనంత రెమ్యునరేషన్ ను ఈమెకు సమర్పించుకుంటారు దర్శకనిర్మాతలు! నిజానికి ఈమెకు ఇంత క్రేజ్ రావడానికి కూడా టాలీవుడ్డే కారణం! అటువంటిది ఈ అమ్మడు తెలుగు దర్శకులను చాలా చులనకగా చూస్తోందని సమాచారం!

ప్రస్తుతం అనుష్కకున్న క్రేజును బట్టి తెలుగు దర్శకనిర్మాతలు ఆమెను తమ సినిమాలో నటింపచేయాలని తెగ ఆరాటపడుతున్నారట! ఎంత పారితోషకం అయినా ఫర్వాలేదు.. ఇవ్వడానికి తాము రెడీ అంటూ ముందుకు వస్తున్నారట! అయితే తాను భారీప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నందున అందుకు చాలా శ్రమపడాల్సి వస్తోందని.. కాబట్టి తనకు ఇతర సినిమాలకు డేట్స్ ఇవ్వడానికి కుదరదు అంటూ వచ్చిన అవకాశాలను తిరస్కరిస్తోందట ఈ అమ్మడు! తాను నటిస్తున్న సినిమాలు అయిపోయిన తర్వాత అయినా తమకు డేట్స్ ఇవ్వాల్సిందిగా నిర్మాతలు ఎంతగానో కోరుకుంటున్నప్పటికీ.. అందుకు ఈ భామ తిరస్కరిస్తోందని సమాచారం! దీంతో ఆమె పడుతున్న శ్రమను, కష్టాన్ని చూసి తెలుగు దర్శకనిర్మాతలు ఆమె సినిమాల్లో నటించాలంటూ ఇబ్బంది పెట్టడం లేదని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

ఇంతవరకు బాగానే వుంది కానీ.. తెలుగుచిత్రాల్లో నటించడానికి వీలుకాదని ఖరాఖండీగా తిరస్కరించిన ఈ హాట్ సుందరీ.. తమిళంలో మాత్రం వరుసగా వస్తున్న ఆఫర్లను అంగీకరిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. కోలీవుడ్ నుంచి వస్తున్న కథలలో తనకు నచ్చిన కథను ఎంచుకుని.. వాటికి ప్రస్తుత సినిమాల షూటింగ్ అనంతరం డేట్స్ కేటాయించిందని తెలుస్తోంది. దీంతో తెలుగు దర్శకనిర్మాతలందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపడుతున్నారు. తాము ఎంత పారితోషికం ఇవ్వడానికైనా సిద్ధపడినా తిరస్కరించినా ఈ అమ్మడు.. తమిళ సినిమాలను వరుసగా ఎందుకు ఒప్పుకుంటుందో అర్థం కావడం లేదని తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు తమిళంలో ‘‘లింగా’’తోపాటు అజిత్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. వాటి తర్వాత మరో సినిమాకు డేట్స్ కేటాయించిందని తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన టాలీవుడ్ దర్శకనిర్మాతలు.. తాము తనకు అంత చులకనగా కనిపిస్తున్నామా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు సాగుతుందో వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anushka shetty  rudramadevi movie  bahubali movie  tollywood directors  telugu news  

Other Articles