Surya first look in mass movie

surya mass movie, surya first look in mass movie, surya latest updates, surya look in mass movie, mass movie latest updates, mass movie posters, mass movie release date, surya next movie, nayanatara next movie, amy jackson movies, koliwood latest updates

surya first look in mass movie : handsome tamil hero surya latest movie first look released as diwali gift to fans of surya look had hollywood style and it creating craze in social media

హాలీవుడ్ రేంజ్ లో ‘మాస్’ ఫస్ట్ లుక్

Posted: 10/22/2014 12:18 PM IST
Surya first look in mass movie

కోలివుడ్ హ్యాండ్ సమ్ హీరో సూర్య తాజా సినిమా ‘మాస్’ ఫస్ట్ లుక్ విడుదల అయింది. దీపావళి కానుకగా ప్రేక్షకుల కోసం మంగళవారం రోజు ఈ లుక్ ను విడుదల చేశారు. కధకు తగ్గట్లుగానే ఫస్ట్ లుక్ లో సూర్య ఆవేశంగా కన్పిస్తున్నాడు. ఈ ఫొటో చూసినవారంతా హాలీవుడ్ రేంజ్ లో ఉంది అని అంటున్నారు. హారర్ కధ, కామెడి కధాంశంతో రూపొందుతున్న ఈ సినిమా లుక్ చూసినవారంతా సూర్య సూపర్బ్ అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.

‘మాస్’ సినిమాలోనయనతార, అమీజాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫస్ట్ లుక్ ఈ స్థాయిలో ఉంటే ఇక సినిమా ఎలా ఉంటుందో అని అంతా చర్చించుకుంటున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా సూర్య ‘మాస్’ సినిమా విడుదల కానుంది.

స్టూడియో గ్రీన్ బ్యానర్స్ పై వస్తున్న ఈ సినిమాను కె.ఈ. జ్ఞానవేల్ నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా త్వరలోనే సింగం డైరెక్టర్ తో మరో సినిమా తీసేందుకు సూర్య సిద్ధం అవుతున్నాడు. 7సెన్స్, యముడు, సింగం వంటి సినిమాలతో కోలివుడ్ ప్రేక్షకులతో పాటు, టాలీవుడ్ లో కూడా సూర్య అభిమానులను సొంతం చేసుకున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mass  surya  first look  koliwood  

Other Articles