Hansika motwani shocks hero simbu and valu movie unit members producer

hansika motwani, hansika latest news, hansika latest movies, hansika vaalu movie, vaalu movie, hansika simbu, hansika simbu love affair, hansika statement, hansika hot photo shoot, vaalu movie

hansika motwani shocks hero simbu and valu movie unit members producer : the south indian hot actress hansika motwani gave statement that she will never give extra dates for vaalu movie

సినిమాకు డేట్స్ ఇవ్వనంటున్న బొద్దుగుమ్మ హన్సిక!

Posted: 09/17/2014 11:04 AM IST
Hansika motwani shocks hero simbu and valu movie unit members producer

ఇటీవలే విడుదలైన హన్సిక సినిమాలు భారీగానే విజయాన్ని అందుకున్నాయి. కెరీర్ గాడిలో పడిపోతుందేమోననుకున్న సమయంలో తాజా సినిమాలు హిట్ సాధించి ఈమెను సక్సెస్ బాటలో నడుపుతున్నాయి. దీంతో ఈ అమ్మడికి ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్ లలో బాగానే డిమాండ్ పెరిగిపోయింది. కొంచెం ఎక్కువ పారితోషికం ఇవ్వడానిక్కూడా నిర్మాతలు సై అంటున్నారు. అయితే ఇంతలోనే ఏమైందో ఏమోగానీ... తాను సినిమాకు డేట్స్ ఇవ్వనంటూ వెనక్కు తగ్గుతోందని సమాచారం! ‘‘ఎవరెంత మొత్తుకున్నా.. తాను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సినిమాకు డేట్స్ ఇవ్వనంటే ఇవ్వను’’ అంటూ తెగేసి చెబుతోంది. అయితే ఇలా అంటున్నది ఇతర సినిమాలకు కాదులెండి... తాను శింబుతో కలిసి నటిస్తున్న ‘‘వాలు’’ చిత్రానికి!

తమిళంలో హన్సిక, శింబుతో కలిసి ‘‘వాలు’’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే! ఆ చిత్రం షూటింగ్ లోనే వీరిద్దరు పీకల్లోతుదాకా ప్రేమలో మునిగిపోయి.. చివరికి పెళ్లి చేసుకోవడానిక్కూడా సిద్ధమయ్యారు. కానీ కొన్ని కారణాలవల్ల వారిద్దరూ విడిపోయారు. దీంతో ఆమె శింబుతో దూరంగా వుండాలని భావిస్తోంది. అయితే.. ఆమె ఎంత దూరం పరిగెత్తాలని ప్రయత్నించినా అతనితో బంధం ఇంగువ కట్టిన గుడ్డలా హన్సికను వెంటాడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. వీరిద్దరు కలిసి నటిస్తున్న ‘‘వాలు’’ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. షూటింగ్ నేపథ్యంలో వీరిద్దరు విడిపోవడం, సినిమాకు సంబంధించి పనులు ఆలస్యంగా జరగడం వల్ల ఆ మూవీ షూటింగ్ ఇంకా ఫైనల్ స్టేజీకి రాలేదు. దీంతో హన్సికను డేట్స్ ఇవ్వాల్సిందిగా కోరగా.. అందుకు ఆమె ఇటీవలే వేరే సినిమాలతో బిజీగా వున్నప్పటికీ ప్రత్యేకంగా డేట్స్ ఇచ్చి సహకరించింది. అయినాకూడా ఆ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదట! దీంతో హన్సిక ఇకనుంచి ఆ మూవీకి డేట్స్ ఇచ్చేది లేదంటూ తెగేసి చెప్పేసింది.

ఈ నేపథ్యంలోనే హన్సిక తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘‘మొదట్లో వాలు సినిమాకోసం 64 రోజులు అడిగారు. అంతేకాకుండా.. అదనంగా మరో ఇరవై రోజులు కూడా ఇచ్చాను. తర్వాత ఇంకో పాటకోసం 7,8,9 తేదీల్లో డేట్స్ ఇచ్చాను. అయితే నిర్మాత మాత్రం వాటిని సద్వినియోగం చేసుకోలేదు. ఈ సినిమాకోసం ఇప్పటికే నా డేట్స్ చాలా వేస్ట్ అయ్యాయి. ఈ సినిమా పూర్తికాకపోవడంతో నా తప్పేమీ లేదు. నావరకు నేను డేట్స్ కేటాయించాను. కానీ వాళ్లు దానిని ఉపయోగించుకోలేదు. కాబట్టి ఇకపై నేను ఆ మూవీకి డేట్స్ ఇచ్చేదే లేదు’’ అంటూ తేల్చి చెప్పేసింది. మరి దీనిపై ఆ చిత్ర దర్శకనిర్మాతలు, హీరో శింబు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే! ఆమెకు ఇంకా ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ ఇచ్చి డేట్స్ కేటాయించుకుంటారా..? లేకపోతే మరో విధంగా దీనిపై చర్చ కొనసాగిస్తారా..? అనేది మాత్రం సస్పెన్స్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles