Murder threaten calls to senior actress director lakshmi ramakrishnan

actress lakshmi ramakrishnan, lakshmi ramakrishnan latest news, threaten calls lakshmi ramakrishnan, director lakshmi ramakrishnana, malayalam movie, tamil movies, telugu news, kollywood news, bollywood actors

murder threaten calls to senior actress director lakshmi ramakrishnan for discussing about controversial statements in her latest television show solva ellam unmai

హత్య చేస్తామని సీనియర్ నటి లక్ష్మీకి బెదిరింపులు

Posted: 09/17/2014 10:41 AM IST
Murder threaten calls to senior actress director lakshmi ramakrishnan

గతకొంతకాలం నుంచి చిత్రపరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీలు బెదిరింపులు చాలా ఎక్కువయ్యాయనే భావించాలి. ఎందుకంటే... మొన్నటికిమొన్న బాద్షా షారుఖ్ ఖాన్, బొమన్ ఇరానీ, మరో ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కు అండర్ వాల్డ్ నుంచి బెదిరింపులు కాల్స్ వచ్చినట్లు బాలీవుడ్ కొన్నాళ్లవరకు కోడై కూసింది. ఇంకా ఆ వ్యవహారం మీద పోలీసులు దర్యాప్తు చేస్తూనే వున్నారు. ఇంతలోనే తమిళ ఇండస్ట్రీకి చెందిన లక్ష్మీ రామకృష్ణన్ కు ఈసారి ఏకంగా హత్య చేస్తామని బెదిరింపులు వచ్చినట్లు కోలీవుడ్ సమాచారం! అంత సవ్యంగానే కొనసాగుతున్న నేపథ్యంలో తనకు ఈ విధంగా బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా షాక్ కు గురైన్ ఆమె.. వెంటనే పోలీసులకు సంప్రదించింది.

తమిళంలో ‘‘పిరివోమ్ సందిప్పోమ్, తిరు తిరు తురు తురు, ఈరం, నాడోడిగళ్, బాస్ ఎన్గిర భాస్కరన్’’ తదితర చిత్రాల్లో ముఖ్య భూమికలను పోషించిన ఈమె.. మలయాళంలోనూ కొన్ని చిత్రాల్లో నటించారు. నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించారు. అనంతరం ‘‘ఆరోహణం’’ చిత్రం ద్వారా దర్శకురాలిగా అవతారమెత్తారు. ప్రస్తుతం నెరింగవా ముత్తమిడాదే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతోపాటు ‘‘సొల్వ ఎల్లాం ఉన్నై’’ అనే టీవీ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జీవితంలో వేదనకు గురైన వారిని వేదికపైకి తీసుకొచ్చి వారి సమస్యలను చర్చించడమే ప్రదానాంశం. ఒకవిధంగా చెప్పాలంటే.. హిందీలో ప్రసారమవుతున్న ‘‘సత్యమేవ జయతే’’లాంటి తరహాలోనే ఇది కూడా వుంటుంది.

ఈ కార్యక్రమం వల్లే నటి లక్ష్మీ రామకృష్ణన్‌కు కొందరు వ్యక్తుల నుంచి హత్యా బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. టీవీ కార్యక్రమంలో లక్ష్మీమీనన్ వివాద స్పద అంశాలను చర్చకు తీసుకొస్తుండటమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. ఈ విషయమై నటి లక్ష్మీ రామకృష్ణన్ భర్త పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై చెన్నై పోలీసులు దర్యాప్తును మొదలుపెట్టారు. వీలైనంత త్వరలోనే ఈ చర్యలకు పాల్పడిన వారిని పట్టుకుంటామని పోలీసులు తెలుపుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles