Hansika praises mass maharaja raviteja

hansika, hansika latest news, hansika hot photo shoot, hansika power movie, power movie news, power movie review, telugu power movie review, raviteja power movie, raviteja latest news, regina news, regina hot photo shoot

hansika praises mass maharaja raviteja : south indian actress hansika praises mass maharaja for movie offers in telugu

‘‘పవర్’’ కోసం పాట్లు పడుతున్న హన్సిక!

Posted: 09/09/2014 01:58 PM IST
Hansika praises mass maharaja raviteja

సాధారణంగా చిత్రపరిశ్రమలో వున్న తారలు... సదరు పరిశ్రమకు చెందిన స్టార్ హీరోల గురించి కొన్ని మాటలు చెప్పి వారి అభిమానుల నుంచి మార్కులను కొట్టేస్తుంటారు. ఇది వారికి వెన్నతో పెట్టిన విద్య! ఎందుకంటే.. తమకంటూ ఒక ప్రత్యేక ముద్రను ఏర్పరచుకోవాలంటే ముందుగా అభిమానులను పొగేసుకోవాల్సి వుంటుంది. అయితే సినిమాల ద్వారా ఫ్యాన్స్ ను సంపాదించుకోవడం అంత సులభమైన పనికాదు. అందువల్లే స్టార్ హీరోలను పొగుడ్తూ కొన్ని మంచి మాటలు చెబితే చాలు.. ఆటోమెటిక్ గా ఆ హీరోల ఫ్యాన్స్ సదరు తారను ఆకాశానికెత్తుకుంటారు. ఆమెకు కావాల్సినంత పబ్లిసిటీని తెచ్చి పెడతారు. ప్రస్తుతమున్న స్టార్ హీరోయిన్లందరూ ఇప్పటికీ ఈ సూత్రాన్నే పాటిస్తుంటారు. ఇప్పుడు వారి జాబితాలోకి బొద్దుగుమ్మ హన్సిక కూడా చేరిపోయింది. ఈ అమ్మడు పవర్ ను పొగడ్తలతో భారీగానే ముంచెత్తుతోంది. అయితే ఇక్కడ పవర్ అంటే పవర్ స్టార్ పవన్ కాదులెండి.. ఆమె తాజాగా నటించిన ‘‘పవర్’’ సినిమాలోని హీరో రవితేజను!

రవితేజ హీరోగా రెజీనా, హన్సిక హీరోయిన్లుగా నటించిన ‘పవర్’ సినిమా ఈనెల 12న విడుదలవుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పాటలు, ట్రైలర్స్ కు ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ సినిమాపై ఎక్కడలేనంత అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే కలెక్షన్లను బాగానే రాబట్టుకోవడం కోసం ఈ మూవీ యూనిట్ సభ్యులు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూ, సినిమాను బాగానే పబ్లిసిటీ చేస్తున్నారు. తాజాగా హన్సిక కూడా ఈ సినిమా గురించి ప్రమోట్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగానే ఈ బొద్దుగుమ్మ సినిమా గురించి కొన్ని విశేషాల గురించి చెబుతూ.. రవితేజను ఆకాశానికెత్తేస్తోంది.

ఇటీవలే ఓ ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన హన్సిక హీరో రవితేజను బాగానే పొగిడేసింది. వయసులో దాదాపు 20 సంవత్సరాలు పెద్దవాడైన రవితేజతో రొమాన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించలేదా? అనే ప్రశ్నకు హన్సిక సమాధానమిస్తూ.... రవితేజ తనకన్నా రెండు పదుల వయసు పెద్దవాడైనా కూడా... తాను రవితేజతో నటిస్తున్నప్పుడు 25 ఏళ్ల యంగ్ హీరోతో నటించిన ఫీలింగ్ కలిగిందని... నటనలో, డాన్స్ లలో నేటి యంగ్ హీరోలతో సమానంగా రవితేజ నిలవగలడని అంటూ మాస్ మహరాజను పొగడ్తలతో ముంచెత్తింది.

ఇదిలావుండగా.. ఈ అమ్మడికి తెలుగులో ప్రస్తుతం ఈ ‘పవర్’ సినిమా తప్ప మరో సినిమా లేదు. ఈ మూవీకి ముందు నాలుగైదు సినిమాల ఆఫర్లు వచ్చినా.. అవన్నీ క్యాన్సిల్ అయ్యాయి. దీంతో తమిళ సినిమాలతో బిజీ అయిపోయింది. అయితే తెలుగులో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడానికే హన్సిక ఇలా మాస్ మహరాజాను పొగిడేస్తుందంటూ టాలీవుడ్ లో ఈ అమ్మడిపై కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమాలు లేకపోవడం వల్ల ఇక్కడ అభిమానులు కూడా భారీగానే తగ్గిపోయారు. దీంతో ఈ అమ్మడు హీరోను పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా.. సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇక, ‘పవర్’ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్టయ్యితే టాలీవుడ్ రికార్డులు తిరగరాయడం ఖాయమంటున్నాయి టాలీవుడ్ సినీ వర్గాలు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hansika motwani  raviteja  telugu power movie  regina  tollywood  

Other Articles