14 reels entertainment banner plans to make movie with mahesh babu with 100 crores budget

mahesh babu, mahesh babu aagadu movie, aagadu movie review, aagadu movie collections, aagadu movie telugu review, aagadu movie photos, aagadu movie gallery, mahesh babu movies, mahesh babu latest news, 14 reels entertainment, 14 reels entertainment banner movies

14 reels entertainment banner plans to make movie with mahesh babu with 100 crores budget

మహేష్ తో 100 కోట్ల సినిమాకు రంగం సిద్ధం!

Posted: 09/09/2014 12:12 PM IST
14 reels entertainment banner plans to make movie with mahesh babu with 100 crores budget

టాలీవుడ్ టాప్ హీరోల జాబితాలో ‘‘నేనొక్కడినే’’ అంటూ దూసుకుపోతున్న ప్రిన్స్ మహేష్ బాబుకు అభిమానుల్లో క్రేజ్ ఎంతుందో అందరికీ తెలిసిందే! ప్రస్తుతం ఈయన నటించిన సినిమాలన్నింటికీ ఎంతకాకున్నా కనీసం 50 కోట్ల వరకు వసూళ్లను ఈజీగా రాబడుతున్నాయంటే.. ఆయనకు ఎంత క్రేజుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు.. టాలీవుడ్ బాక్సాఫీస్ ను మొట్టమొదటిసారిగా బద్దలు కొట్టిన ‘‘పోకిరి’’ కూడా ఇతడే! ఇక అప్పటి నుంచి ఇతని సినిమాలు ఫ్లాపయినప్పటికీ నిర్మాతలకు లోటు లేకుండా కలెక్షన్లు మాత్రం బాగానే రావడం మొదలయ్యాయి. దీంతో మహేష్ తో కలిసి ఎంత భారీ బడ్జెట్ చిత్రాన్నైనా నిర్మించడానికి ప్రొడ్యూసర్లు సిద్ధంగా వుంటారు. ప్రస్తుతం ఇతని సినిమాలు ఎంత తక్కువ అనుకున్నా.. 40 కోట్ల బడ్జెట్ ఖచ్చితంగా వుండాల్సిందే! అంతటి మార్కెట్ ను సంపాదించుకున్నాడు ఈ రాజకుమారుడు!

ఇదిలావుండగా.. తాజాగా ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి 100 కోట్ల భారీ బడ్జెట్ చిత్రాన్ని తెరకెక్కించడానికి 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్ సిద్ధంగా వుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సంస్థ టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో కూడిన చిత్రాలను నిర్మిస్తూ.. మంచి విజయాలను అందించడంతోపాటు బిజినెస్ లోనూ దూసుకుపోతోంది. ముఖ్యంగా మహేష్ బాబుతో తెరకెక్కించిన ‘‘దూకుడు’’ భారీ విజయం సాధించడంతో అప్పటినుంచి ఆ సంస్థ వెనుదిరిగి చూడలేదు. ఇక మహేష్ మీదున్న నమ్మకంతో ఆ సంస్థ ‘‘నేనొక్కడినే’’ సినిమాను 70 కోట్ల బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధపడింది. అయితే ఈరోస్ సంస్థవారు వారినుంచి ఆ సినిమాను 72 కోట్లకు సొంతం చేసుకుంది. ఇదిలావుండగా.. ఇటీవలే మహేష్ దూకుడు సినిమాను కన్నడలో ‘‘పవర్’’ పేరుతో నిర్మించిన ఈ సంస్థకు.. అక్కడ కూడా ఘనవిజయం సాధించింది. దీంతో మహేష్ తో తమ సంస్థకు లక్ బాగా కుదిరిందనే నేపథ్యంలో 14 రీల్స్ మహేష్ తో కలిసి 100 కోట్ల భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తోంది.

అయితే మహేష్ తో నిర్మించే ఈ 100 కోట్ల బడ్జెట్ మూవీ తిరిగి ఆ డబ్బులను రాబట్టగలిగే దర్శకుడితోనే చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచనలో వున్నట్లుగా తేలింది. దీంతో ఆ దర్శకుడు కోసం వేట మొదలుపెట్టిన 14 రీల్స్.. వెంటనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనలను త్వరలోనే విడుదల చేయనున్నట్టుగా తెలిపింది. ప్రస్తుతం మహేష్ ‘‘ఆగడు’’ చిత్రాన్ని నిర్మించిన ఈ సంస్థ.. ఆ మూవీ మీద భారీ అంచనాలనే పెట్టుకుంది. ‘‘దూకుడు’’ కంటే ఎక్కువ కలెక్షన్లను రాబడుతుందనే ధీమాను వ్యక్తం చేస్తోంది. ఈ సినిమా మాంచి కలెక్షన్లను రాబడితే.. త్వరలోనే 100 కోట్ల మూవీ రెడీ అవుతుందని పేర్కొంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu  14 reels entertainment  100 crores budget movies  tollywood news  

Other Articles