Srilankan beauty pooja caught kissing with director bala

actress pooja, pooja umashankar, pooja umashankar hot photos, pooja umashankar with director bala, director bala pooja umashankar, naan kaduval, pooja umashankar biography

srilankan beauty pooja caught kissing with director bala

దర్శకుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నటి పూజా!

Posted: 09/02/2014 01:32 PM IST
Srilankan beauty pooja caught kissing with director bala

(Image source from: srilankan beauty pooja caught kissing with director bala)

తమిళ చిత్రపరిశ్రమలో హీరోయిన్ గా కొనసాగుతున్న శ్రీలంకన్ భామ పూజా ఉమాశంకర్... ఒక దర్శకుడితో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. ఆ దర్శకుడు కూడా మరెవరో కాదు... వైవిధ్యభరితమైన చిత్రాలను తెరకెక్కించి దర్శకులలో ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకున్న బాలా! వీరిద్దరికీ సంబంధించిన చుంబనాల ఫోటోలు ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. మూడుపదుల వయసు దాటినా ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా ఇంకా సినిమాలు చేసుకుంటున్న పూజా, బాలాతో కలిసి ముద్దులు పెట్టుకోవడాన్ని చూస్తుంటే కోలీవుడ్ మీడియా వర్గాలు రకరకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి.

సాధారణంగా నటీనటులు ఒకర్నొకరు ముద్దులు పెట్టుకోవడం, బయట షికార్లకు తిరగడం పరిపాటిగా మారిపోయింది కానీ... ఇక్కడ దర్శకుడు, నాయిక ఒకర్నొకరు ముద్దులు పెట్టుకోవడం రకరకాల వదంతులు షికార్లు చేస్తున్నాయి. అన్ని సవ్యంగా జరిగితే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోనైనా చేసుకోవచ్చునే అనుమానాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి. 2009లో ఒక చిత్రం ద్వారా పరిచయమైన వీరిద్దరూ.. మళ్లీ చాలాకాలం తర్వాత ఇలా ముద్దులాడుకుంటూ కనువిందు చేయడంతో ఇండస్ట్రీ వర్గాల్లో రకరకాలుగా చర్చించుకుంటున్నారు. బాలా లాంటి దర్శకుడు కూడా హీరోయిన్లతో ఇలా చుంబనాలు ఇచ్చుకుంటారా అంటూ అందరూ నోళ్లవెళ్లబెట్టకుంటున్నారట!

2009లో బాలా దర్శకత్వం వహించి నాన్ కడువల్ చిత్రంలో పూజా హీరోయిన్ గా నటించింది. అందులో ఈ అమ్మడు అంధురాలిగా నటించి, విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది. ఆమె నటనాప్రతిభకు ఫ్లాట్ అయిపోయిన బాలా పూజాకు మరో పరదేశి చిత్రంలో అవకాశం ఇచ్చినప్పటికీ దానిని ఆమె నిరాకరించింది. దీంతో వీరిద్దరి మధ్య విభేదాలొచ్చాయంటూ అప్పట్లో పుకార్లు రాగా... తాను ఇతర సినిమాలతో బిజీగా వుండటం వల్లే బాలాతో చేయడంలేదని.. తమ మధ్య ఎటువంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చేసింది. అయితే ఆ తర్వాత కొంతకాలం వరకు వ్యక్తిగత కారణాలవల్లో లేక అవకాశాలు రాకపోవడం వల్లో పూజా నటనకు దూరంగా వుండిపోయింది.

ఇప్పుడు తాజాగా తాను తిరిగి మరోసారి చిత్రాల్లో నటించడానికి సిద్ధం అయ్యింది. ఈ నేపథ్యంలో అవకాశాలకోసం ఈ అమ్మడు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోందట! ఈ క్రమంలోనే దర్శకుడు బాలాతో కలిసి సినిమాలో ఛాన్స్ ఇవ్వాల్సిందిగా అడిగినట్టు సమాచారం. అయితే అంతటితో ఆగకుండా బాలాపై ముద్దులవర్షాన్ని కురిపించేసిందట ఈ భామ! అలాగే ఆయన కూడా పూజా బుగ్గలపై ముద్దు పెట్టేశారులెండి! ఈవిధంగా వీరిద్దరు ఆడుకున్న ఈ చుంబనాల ఆట ఫోటోల ద్వారా సోషల్ మీడియా ద్వారా బయటపడటంతో.. కోలీవుడ్ లో రకరకాల వదంతులు వీరిద్దరిపై వస్తున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pooja umashankar  director bala  naan kaduval movie  tamil actress  kollywood  

Other Articles