Angelina jolie and brad pitt secret marriage photos leaked

angelina jolie hot photos, angelina jolie latest photo shoot, angelina jolie movies, angelina jolie brad pitt, brad pitt latest movie, angelina jolie brad pitt marriage photos

angelina jolie and brad pitt secret marriage photos leaked

గుట్టుచప్పుడు కాకుండా సీక్రెట్ గా చెక్కేశారు!

Posted: 09/02/2014 02:00 PM IST
Angelina jolie and brad pitt secret marriage photos leaked

(Image source from: angelina jolie and brad pitt secret marriage photos leaked)

హాలీవుడ్ స్టార్ జంటగా పేరుగాంచిన ఏంజెలీనా జోలీ, బ్రాడ్ పిట్ లు దాదాపు పదేళ్లనుంచి సహజీవనం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే! ఇందుకు ప్రతీకగా వీరికి ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు కానీ ఇంతవరకు పెళ్లిమాత్రం చేసుకోలేదు. వీరిద్దరికీ పిల్లలు పుట్టకముందే మరో ముగ్గురు పిల్లలను దత్తతు తీసుకున్న విషయం విదితమే! వీరిద్దరు సహజీవనం చేస్తున్నారన్న విషయం ప్రపంచవ్యాప్తంగా తెలిసినప్పటికీ.. వీరుమాత్రం ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారని తెలిసింది!

ఆగస్టు 23వ తేదీన దక్షిణ ఫ్రాన్స్ లోని ఓ గ్రామంలో వున్న కుటుంబ ఎస్టేట్ లో జోలీ, బ్రాండ్ లు పెళ్లి చేసుకున్నారన్న వార్తను అధికారి ప్రతినిధి మీడియాకు వెల్లడించాడు. ఈ వేడుకకు కేవలం వారి ఆరుగురు పిల్లలు, ఇతర కుటుంబసభ్యులు, ఇంకా ఇరవైమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారని తెలిపాడు. వీరు ఇంత సీక్రెట్ గా ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందన్న విషయం మాత్రం ఇంతవరకు తెలియలేదు. ఇదిలావుండగా.. వీరిద్దరి వివాహానికి సంబంధించిన ఫోటోలను ప్రముఖ ‘‘హల్లో, పీపుల్’’ అనే మ్యాగజైన్ లు తమ కవర్ పేజీల మీద తాజాగా ప్రచురించాయి. దీంతో ఈ సీక్రెట్ పెళ్లి బండారం బయటపడినట్లు తెలుస్తోంది.

2005వ సంవత్సరంలో హాలీవుడ్ యాక్షన్ చిత్రం అయిన ‘‘మిస్టర్ అండ్ మిస్ స్మిత్’’ లో కలిసి పనిచేసిన జోలీ, బ్రాడ్ పిట్ ల మధ్య ప్రేమ చిగురించింది. ఇక అప్పటినుంచి వీరిద్దరూ విచ్చలవిడిగా తిరుగుతూ, సహజీవనం చేయసాగారు. ఇప్పుడు తాజాగా వీరిద్దరు ఈ పెళ్లి ద్వారా భార్యాభర్తలుగా మారారు. గతంలో ఏంజెలీనా జోలీకి రెండుసార్లు, బ్రాడ్ పిట్ కు ఒకసారి వివాహం కూడా జరిగిపోయింది. కానీ కొన్ని కారణాల వల్ల వారిమధ్య విభేదాలు రావడంతో అలా విడాకులు తీసుకొని విడిపోయారు. అనంతరం ఒక సినిమా ద్వారా కలిసిన వీరిద్దరూ.. అక్కడి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tags : angelina jolie  brad pitt  angelina jolie brad pitt  hollywood news  

Other Articles