Bellamkonda srinivas comments on junior ntr

junior ntr, ntr movies, ntr marriage, ntr son photo name, nandamuri fans, bellamkonda suresh, bellamkonda srinivas, alludu seenu, rabhasa movie, rabhasa movie release date, tollywood, bollywood, latest news

junior ntr shocked by bellamkonda comments on rabhasa relaase postponment : rabhasa postponed to 29th august bellamkonda srinivas comments on publicity

ఎన్టీఆర్ కు అంత అవసరం లేదన్న బెల్లంకొండ

Posted: 08/25/2014 01:11 PM IST
Bellamkonda srinivas comments on junior ntr

రభస సినిమా విడుదలయి ఎంత రభస చేస్తుందో చెప్పలేము కానీ.., విడుదలకు ముందు మాత్రం రసాభాస చేస్తోంది. సినిమా విడుదల, ప్రమోషన్లపై వరుసగా వివాదాలు జరుగుతున్నాయి. సినిమా విడుదల వాయిదా లేదంటూనే వాయిదా వేసి నందమూరి ఫ్యాన్స్ కు కోపం తెప్పించారు బెల్లంకొండ సురేష్. ఇప్పుడు ఆయన కొడుకు శ్రీనివాస్ కామెంట్లు నందమూరి ఫ్యాన్స్ నే కాదు.., ఎన్టీఆర్ కే షాకిస్తున్నాయి. సురేష్ ఫేస్ బుక్ ద్వారా ఇచ్చిన సమాధానంకు ఏం చేయాలో తెలియక జూనియర్ ఆశ్చర్యపోతున్నాడని వార్తలు వస్తున్నాయి.

రభస సినిమా ప్రమోషన్ సరిగా లేదని నందమూరి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఫేస్ బుక్ లో స్పందించిన బెల్లంకొండ శ్రీనివాస్, రభస సినిమా ప్రమోషన్ సరిగా చేయటం లేదని తమకు చాలాఫోన్లు వస్తున్నాయని చెప్పారు. దీనిపై ఇంత వివాదం చేయాల్సిన అవసరం లేదన్నారు. అల్లుడు శీను తనకు తొలి సినిమా కాబట్టి.., ప్రేక్షకులు తనను గుర్తుంచుకునేలా మరీ మరీ చూపటం అవసరమన్నారు. తన తండ్రే ఈ సినిమా నిర్మించటంతో ఇద్దరికీ ప్రమోషన్ తప్పనిసరి అని వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ విషయానికొస్తే తారక్ కు అంత పబ్లిసిటీ అవసరమా? తనకున్న పాపులారిటీతో ఎలాంటి ప్రచారం లేకుండానే ఫ్యాన్స్ ను థియేటర్ కు తీసుకురాగల సత్తా ఎన్టీర్ కు ఉందని తెలివిగా సమాధానం ఇచ్చాడు. రభస సినిమా ఇప్పటికే డిస్ర్టిబ్యూటర్ల చేతికి వెళ్లినందున పబ్లిసిటీ వారే చూసుకోవాలని చెప్పాడు. ఈ కామెంట్ చూసిన జూనియర్ షాక్ అయ్యాడని సినీవర్గాలు అంటున్నాయి.

అల్లుడు శీను కోసం 7కోట్లు ఖర్చుపెట్టిన సురేష్.., తన సొంత సినిమాపై ఇలా మాట్లాడటం ఏంటని టాలీవుడ్ లో అంతా చర్చించుకుంటున్నారు. ఆగస్టు 29న ఈ సినిమా విడుదల కానుంది. ఎన్టీఆర్ 7 యాక్షన్ సీన్లు హైలైట్ అవుతాయని అంచనా వేస్తున్నారు. నందమూరి సరసన ఈ సినిమాలో సమంత నటిస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో డబ్బింగ్ రైట్స్ తో కలిపి ఈ సినిమా 56కోట్లు ఆర్జించింది. విడుదలకు ముందే ఈ స్థాయిలో వసూలు చేయటంతో సినిమాపై అభిమానుల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rabhasa  junior ntr  bellamkonda suresh  tollywood news  

Other Articles