Renu desai using pawan name for publicity of her movie

pawan kalyan, renu desai, pawan kalyan son, pawan kalyan marriage, pawan kalyan marriages, ishq wala love movie, renu desai movie, pawan birthday, mega family, latest news, tollywood news, bollywood news, film news, latest films

renu desai using pawan name for her ishq wala love movie promotion : renu desai releasing her ishq wala love movie teaser on pawan birthday to get craze with pawan name

పవన్ ను వాడుకుంటున్న రేణు !!

Posted: 08/25/2014 01:36 PM IST
Renu desai using pawan name for publicity of her movie

ఎవరెవరో పవన్ పేరు వాడుకంటున్నారు. బాగుపడుతున్నారు. తానెందుకు వాడుకోకూడదు అనుకుంది రేణు. తన మాజి భర్త పేరుకు ఉన్న పాపులారిటీ పసిగట్టి.., తనూ వాడుకుని బాగుపడాలనుకుంటోంది. అందుకే తన సినిమా ‘‘ఇష్క్ వాలా లవ్ ’’ ప్రమోషన్లలో పవన్ పేరును జపిస్తుంది. ఇప్పటివరకు నిర్మాతగా ఉన్న రేణు.., దర్శకత్వం వహిస్తున్న తొలి సినిమా ఇది. దీంతో ఈ సినిమాకు క్రేజ్ తెచ్చేందుకు పవర్ స్టార్ ను లైఫ్ లైన్ గా ఎంచుకుంది. ఇలా చేయటం వల్ల పవన్ పేరు జపించటంతో పాటు సినిమాకు పాపులారిటీ పెరుగుతుందని భావిస్తోంది.

ఆ మద్య ఆడియో ఫంక్షన్ కు పవన్ వస్తాడని తెగ ప్రచారం చేసింది. చివరకు వెన్ను నొప్పి వల్ల రాలేకపోయాడని కవర్ చేసి.., పవన్ సంతకం పెట్టిన సీడీలు వెబ్ సైట్లో పెట్టి హడావుడి చేసింది. ఇప్పుడు పవర్ స్టార్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 2న ఈ సినిమా టీజర్ విడుదల చేస్తోంది. పవన్కు ఇదే పుట్టిన రోజు గిఫ్ట్ అని ప్రచారం చేసి క్రేజ్ సంపాదిస్తుందని ఊహాగానాలు వస్తున్నాయి. పవన్ రేణు కొడుకు అకిరా నందన్ పేరుతో స్థాపించిన ప్రొడక్షన్ హౌజ్ పేరుతో ఈ సినిమా బయటకు వస్తుంది. పవన్ పేరు వాడుకున్న ప్రతి సినిమా దాదాపు హిట్టవుతుంది. ఇదే సెంటిమెంట్ రేణుకు కూడా వర్కవుట్ అయి టీజర్ ఏ మాత్రం బాగున్నా.., కలెక్షన్ల మోత మోగుతుందని అంచనాలు విన్పిస్తున్నాయి.

పవన్ రేణు అనుబంధం ఇవాళ్టిది కాదు. ప్రస్తుతం వీరు విడిగా ఉంటున్నా..., పవన్ ఎక్కువకాలం ఉంది రేణుతోనే. వీరి అనుబంధానికి గుర్తుగా అఖిరా నందన్ పుట్టాడు. పవర్ స్టార్ కు దూరంగా ఉంటున్నా.., సోషల్ మీడియాలో పవన్ జపం చేస్తూ ప్రచారంలో ఉంటోంది. ఇప్పుడు సినిమాకు కూడా మాజి భర్త పేరు వాడుకుంటుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  renu desai  ishq wala love  latest news  

Other Articles