Gopichand loukyam movie first look teaser

Loukyam Teaser, Gopichand Loukyam Movie Teaser, Gopichands New film title Loukyam, Gopichand Loukyam Teaser released, Loukyam first look Teaser released, Gopichand Loukyam Teaser

Actor Gopichand Loukyam first look teaser is released today by the makers Bhavya Creations.... Actor Gopichand and actress Rakul Preet Singh first look in director Srivas Telugu movie Loukyam is released.

యాక్షన్ లో కామెడీ లౌక్యం ట్రైలర్ అదుర్స్

Posted: 08/21/2014 11:14 AM IST
Gopichand loukyam movie first look teaser

గోపిచంద్, రకూల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లౌక్యం’. ‘లక్ష్యం’ సినిమా తర్వాత శ్రీవాస్ దర్శకత్వంలో మళ్లీ గోపిచంద్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భవ్య క్రియేషన్స్ బ్యానర్లో నిర్మాత ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. అయితే తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎక్కువగా యాక్షన్, ఎంటర్ టైన్మెంట్ వుండే విధంగా దర్శకుడు జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అలాగే ఇందులో గోపిచంద్ ‘మనం’ సినిమా పోస్టర్ ను కాపీ కొట్టేసాడు. నాగార్జున, నాగచైతన్య, అక్కినేని స్థానాలలోని ‘మనం’ సినిమా పోస్టర్ ను కాపీ కొట్టి, ఆ ముగ్గురు స్థానాలలో గోపిచంద్ ఫోటోలను మార్ఫింగ్ చేసి చూపించారు.

ఇటీవలే గోపిచంద్, హాట్ బ్యూటీ హంసా నందినిలపై ఓ హాట్ ఐటెం సాంగ్ తెరకెక్కించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శంకర్ నేతృత్వంలో ఈ పాటను చిత్రీకరించారు. ఇప్పటికే మూడు పాటల చిత్రీకరణ పూర్తయ్యింది. మరో మూడు పాటలను విదేశాల్లో చిత్రీకరించనున్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు శ్రీధర్ సీపాన అందించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మీ అందరి కోసం ఈ చిత్ర ట్రైలర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles