Allu arjun clarifies drunk and drive incident

Allu Arjun clarifies rumors of drunken drive incident, Allu Arjun's Drunk And Drive Incident, Allu Arjun Clears the Air on Drunk and Drive Incident, Allu Arjun Says he Took Drunk Driving Test, Allu Arjun allegedly caught drunk driving, Allu Arjun clarifies, drunk and drive incident, Allu Arjun drunk and drive incident

actor Allu Arjun, who received flak from his fans following an online video in which he is seen skipping a drunk-and-drive test.. Allu Arjun skipping the drunk and drive test and leaving a police check-point after arguing with the cops

డ్రంక్ అండ్ డ్రైవ్ వివాదంపై బన్నీ క్లారిటీ

Posted: 08/21/2014 09:49 AM IST
Allu arjun clarifies drunk and drive incident

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా మద్యం సేవించి వాహనం నడిపారని వస్తున్న వార్తలన్నీ కూడా గాలివార్తలేనని తెలిపోయింది. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనీఖీల్లో బన్నీపై పోలీసులు పరీక్షలు జరిపినట్టుగా వార్తలొచ్చాయి. ఆ సమయంలో బ్రీత్ అనలైజర్ ముందు తనకు అసౌకర్యంగా వుందని బన్నీ పోలీసులకు చెప్పడంతో అక్కడినుంచి బన్నీని పోలీసులు తీసుకెళ్లారని, ఆ తర్వాత బన్నీ మద్యం తీసుకోలేడని తెలియడంతో బన్నీని పోలీసులు పంపించేసారని తెలిసింది. అయితే ఈ వార్తలపై బన్నీ స్పందించాడు.

తాను తాగలేదంటూ బన్నీ స్పందించాడు. తాను అలాంటి వాడిని కాదని.. ఒకవేళ తాగి ఇంటికి వెళ్లాల్సి వస్తే ఆటో టాక్సీలో కానీ లేదా ఎవరైనా ఇతరుల సహాయంతోకానీ ఇంటికి వెళ్తానే తప్ప ఇలా తాగి కారు నడపనని తేల్చిచెప్పాడు. అక్కడ మీడియా, కెమెరాలు వుండటం వల్లే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయించుకోవడానికి ఇష్టం లేక అక్కడి నుంచి కొంత దూరం వెళ్లిన తర్వాత టెస్ట్ చేయించుకున్నానని చెప్పాడు. తాను అల్కాహాల్ తాగలేదని నిర్ధారించుకున్నాకే పోలీసులు తనని పంపించారని బన్నీ ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు. అంతేకాకుండా కొన్ని మీడియాలు తాను టెస్ట్ చేయించుకున్న వీడియోని చూపించకుండా... కేవలం ఇలా సగంసగం ఎడిట్ చేసిన వీడియోను చూపించాయంటూ బన్నీ ఆవేదన వ్యక్తం చేసాడు.

బన్నీ వివరణతో ఈ విషయంపై అభిమానులతో పాటు మాములు జనాలకు కూడా బన్నీ ఎలాంటి తప్పు చేయలేదని అర్థమయ్యింది. చట్టం ముందు అందరూ సమానులే అని బన్నీ మరోసారి నిరూపించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun drunk and drive  Allu Arjun  drunk and drive  Allu Arjun movies  

Other Articles