Kishore pardasani clarifies rumours about gopala gopala movie script

kishore pardasani clarifies rumours about gopala gopala movie script, pawan kalyan latest news, pawan kalyan in gopala gopala movie, gopala gopala movie photos, pawan kalyan krishnavatar in gopala gopala movie, kishore pardasani comments on pawan kalyan, victory venkatesh with pawan kalyan, venkatesh comments on pawan kalyan, pawan kalyan comments on venkatesh

director kishore pardasani (dolly) clarifies rumours on pawan kalyan about gopala gopala movie script

పవన్ స్టార్ కు ‘‘గోపాల గోపాల’’తో సంబంధం లేదట!

Posted: 07/26/2014 12:56 PM IST
Kishore pardasani clarifies rumours about gopala gopala movie script

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘‘గోపాల గోపాల’’! అయితే తాజాగా ఈ సినిమా స్ర్కిప్ట్ తో పవన్ కు ఎటువంటి సంబంధం లేదని డైరెక్టర్ డాలీ కుండబద్ధలు కొట్టేశాడు. దీంతో యూనిట్ సభ్యులతో సహా ప్రేక్షకాభిమానులు కూడా సంగ్ధిదతలో మునిగిపోయారు. అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో.. ఏం చెబుతున్నాడో.. అనే డైలామాలో మునిగిపోయారు. చివరికి అతను ఈ విషయం మీద క్లారిఫై ఇచ్చేశాడు.

గతంలో పవన్ కల్యాణ్ ‘‘గోపాల గోపాల’’ మూవీ స్ర్కిప్ట్ లో జోక్యం చేసుకుని, చాలా మార్పులు చేర్పులు చేశాడని జోరుగా వార్తలు వచ్చాయి. ఆయన జోక్యం చేసుకోవడం వల్లే సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అయిందని, రిలీజ్ డేట్ కూడా సంక్రాంతికి మార్చుకోవాల్సి వచ్చిందని పుకార్లు షికార్లు చేశాయి. అయితే అవన్నీ ఒట్టి వదంతులేనని.. మూవీ స్ర్కిప్ట్ లో పవన్ ఎటువంటి జోక్యం చేసుకోలేదని అంటూ ఆయన స్పష్టం చేస్తూ.. పవన్ పై వస్తున్న రూమర్లను ఖండించారు.

సినిమా స్ర్కిప్ట్ గురించి పవన్ కు చెప్పినప్పుడు ఆయన సంతోషపడ్డారని, హిందీలోలాగే ఈ చిత్రంలో కూడా పవన్ పాత్ర 25 నిముషాల క్యారెక్టర్ వుంటుందని ఆయన వెల్లడించారు. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం ఈ సినిమా స్ర్కిప్ట్ లో ఎటువంటి మార్పులు చేయలేదని చెప్పిన ఆయన... అటువంటి వార్తలు రావడం వల్ల పవన్ చాలా అసంతృప్తిగా వున్నారని ఆయన పేర్కొన్నాడు. సినిమా షూటింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడం, పవన్ కల్యాణ్ కూడా చాలా రోజుల తరువాత షూటింగ్ కు హాజరు కావడంపై మీడియాలో రకరకాల వార్తాకథనాలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఖండిస్తూ డైరెక్టర్ డాలీ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఈ మూవీ స్ర్కిప్టును బాగా వంటబట్టించుకున్నారని, ఎక్కువరే రీటేకులు తీసుకోకుండా ఆయన తొందరగానే తన పాత్రవరకు వున్న షూటింగ్ ను ముగించుకుంటున్నారని పేర్కొన్నాడు. వెంకటేష్, పవన్ కల్యాణ్ లు మంచి స్నేహంగా మెలగడంతో మేము షూటింగ్ ను త్వరగానే ముగించుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఈ సినిమా జనవరి సంక్రాంతి పండుగనాడు ప్రేక్షకుల ముందుకొస్తుందని ఆయన చెప్పారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles