Kick movie creating new records in bollywood history

Salman khan kick movie creating new records in bollywood history, salman khan latest news, salman khan kick movie, salman khan in kick movie, salman khan latest news, salman khan kick movie collections, salman khan kick movie photos, kick movie collections, bollywood kick movie collections, salman khan kick movie first weekend collections, salman khan kick movie first week collections, salman khan with jacqueline fernandez

Salman khan kick movie creating new records in bollywood history

తొలిరోజు నుంచే రికార్డులు బద్దలుకొడుతున్న ‘‘కిక్’’!

Posted: 07/26/2014 01:33 PM IST
Kick movie creating new records in bollywood history

తెలుగులో రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ‘‘కిక్’’ మూవీ బాలీవుడ్ లో కూడా అదే టైటిల్ తో సల్మాన్ ఖాన్ హీరోగా శుక్రవారంనాడు విడుదలైన విషయం తెలిసిందే! అయితే ఈ సినిమా బాలీవుడ్ లో ఇంతవరకు లేని రికార్డులను బద్దలుకొట్టిసారేసింది. ఇప్పటివరకు ఏ చిత్రం సృష్టించని సరికొత్త చరిత్రను సృష్టించడమే కాకుండా... సల్మాన్ ఖాన్ కెరీర్ లోనే సంచలన చిత్రంగా నిలిచిపోయేలా ఈ సినిమా తన తడాఖాను చూపిస్తున్నట్టు కనిపిస్తోంది.

సాధారణంగా ఏదైనా ఒక సినిమాను ప్రపంచవ్యాప్తంగా వెయ్యి థియేటర్లలో రిలీజ్ చేస్తే ఒక గొప్ప విషయంగా భావిస్తారు. కానీ ఈమధ్యకాలంలో ఆ రేంజ్ మరీ ఎక్కువగా పెరిగిపోయింది. షారుఖ్ ఖాన్ నటించిన ‘‘చెన్నై ఎక్స్ ప్రెస్’’ మూవీ 3500 థియేటర్లలో రిలీజ్ కాగా... ఆమీర్ ఖాన్ ‘‘ధూమ్ 3’’ మూవీ దాదాపు 4300 థియేటర్లలో రిలీజ్ అయింది. కానీ సల్మాన్ ఖాన్ ‘‘కిక్’’ చిత్రం మాత్రం ఈ రెండు సినిమాలను తలదన్నేసేలా ఏకంగా 5000కు పైగా థియేటర్లలో విడుదల అయి సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.

దేశవ్యాప్తంగా 4400 థియేటర్లలో రిలీజ్ కాగా, విదేశాల్లో 700 స్ర్కీన్స్ లో శుక్రవారం విడుదలైంది. అంతేకాదండోయ్... ఇంతవరకు ఏ భారతీయ చిత్రం రిలీజ్ కానీ ఫ్రాన్స్, జర్మనీ, మొనాకో, మాల్దీవులు వంటి దేశాలతో కలిపి మొత్తం 42 కంట్రీస్ లో విడుదల కాబోతోంది. భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఏ సినిమా ఇన్ని థియేటర్లలోకానీ, ఇన్ని దేశాలలోకానీ రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమా మీద అంచనాలు రెట్టింపయ్యాయి. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా బాలీవుడ్ లో కలెక్షన్ల సునామీ సృష్టించడం ఖాయమని ప్రతిఒక్కరు ఫిక్స్ అయిపోయారు.

ప్రస్తుతం సినిమా పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోతోంది కాబట్టి... తొలి వీకెండ్ లోనే కలెక్షన్లపరంగా సల్మాన్ ఖాన్ రికార్డులను మోకరిల్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మొదటిరోజులోనే 26 నుంచి 28 కోట్ల దాకా కలెక్షన్లను రాబట్టిందని బాక్సాఫీస్ రికార్డులు పేర్కొంటున్నాయి. ఇక శని, ఆదివారాల్లో ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొలివారం కలెక్షన్లు 200 కోట్లతో ‘‘చెన్నై ఎక్స్ ప్రెస్’’ ముందుస్థానంలో వుంది. అలాగే ‘‘ధూమ్ 3’’ మొత్తంగా 500 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సాధించింది. మరీ సల్మాన్ ఖాన్ ‘‘కిక్’’ ఈ రెండు రికార్డులను బద్దలు కొడుతుందో లేదో తెలియాలంటే.. ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను బట్టి లెక్క వేయొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles