Raj kundra comments comments on salman khan

raj kundra controversial comments on salman khan, raj kundra latest news, shilpa shetty latest news, salman khan latest news, salman khan news, rajkundra news, raj kundra comments on salman khan, shilpa shetty comments on salman khan, raj kundra with salman khan, shilpa shetty with salman khan, salman khan with shilpa shetty, salman khan comments on raj kundra

shilpa shetty husband raj kundra controversial comments on salman khan

సల్మాన్ ఖాన్ ను రెచ్చగొట్టిన శిల్పాశెట్టి భర్త

Posted: 07/24/2014 03:57 PM IST
Raj kundra comments comments on salman khan

ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, రాజస్థాన్ రాయల్స్ కో-ఓనర్ అయిన రాజ్ కుంద్రా.. సల్మాన్ ఖాన్ ను ఏకిపారేసే విధంగా విమర్శలు చేశాడు. ‘‘నా ముందు సల్మాన్ ఖాన్ దేనికి పనికిరాడు’’ అని వివాదాస్పదమైన కామెంట్లు చేశాడు. దీంతో ఈ విషయం ఇప్పుడు పెద్ద దుమారంగా మారిపోయింది. సల్లూభాయ్ ఫ్యాన్స్ రాజ్ కుంద్రా మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ కుంద్రాకు మతి పోయిందని, తాకిన మైకంలో పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నాడని అభిమానులు అతని మీద విరుచుకుపడ్డారు.

తాజాగా రాజ్ కుంద్రా పాల్గొన్న ఇంటర్వ్యూలో భాగంగా ఒక జర్నలిస్ట్.. ‘‘మీరు బాలీవుడ్ లో నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారా..?’’ అని అడిగిన ప్రశ్నకు మన బిజినెస్ మేన్ ఇచ్చిన సమాధానంతో యావత్తు ముంబై వర్గాలలో వుండే వారందరూ షాక్ కు గురయ్యారు. ‘‘బాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న సల్మాన్ ఖాన్ ఒక సినిమాకు ఎంత మొత్తం సంపాదిస్తాడో... దానికన్నా మూడురెట్లు ఎక్కువ డబ్బును నేను కేవలం ఒక్క నెలలోనే సంపాదిస్తాను. అలాంటప్పుడు నేను సినిమాల్లో ఎందుకు నటించాలనుకుంటాను..? మీరే చెప్పండి..!’’ అని విలేకరులకే ప్రశ్నించాడు.

‘‘సంపాదన విషయంలో సల్మాన్ ఖాన్ తనకు దరిదాపుల్లో కూడా లేడని.. అవసరమైతే ఏకంగా సల్మాన్ ఖాన్ ని అడిగి తెలుసుకోండి’’ అని విలేకరులకు సవాల్ విసిరాడు. బాలీవుడ్ ఎట్టి పరిస్థితుల్లోనూ తనకయ్యే ఖర్చును భరించలేదని, దానికంత స్థోమత కూడా లేదని అతను తీవ్రంగా వ్యాఖ్యానించాడు. ‘‘ఏదో నా భార్య సంబరపడుతోందని నేను బాలీవుడ్ లో సినిమాలను నిర్మిస్తున్నానే తప్ప... హీరోగా ఎంట్రీ అవ్వాలనే ఆలోచన నాకు లేదు’’ అని అతను స్పష్టం చేశాడు.

ఇంతవరకు బాగానే వుంది కానీ... సల్మాన్ ఖాన్ పేరెత్తి రాజ్ కుంద్రా చాలా పెద్ద తప్పు చేశాడని సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఇతను చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా వున్న సల్మాన్ ఖాన్ అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ బుక్, ట్విటర్ వంటి సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలో కుంద్రాపై తిట్లపురాణాన్ని మొదలుపెట్టేశారు. ‘‘సల్మాన్ ఖాన్ లాంటి వ్యక్తితో పోల్చుకోవడానికి నువ్వెవరు..?’’ అంటూ మండిపడుతున్నారు. మరి సల్మాన్ ఖాన్, రాజ్ కుంద్రా వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles