Samantha want to act in bahubali movie

Samantha want to act in bahubali movie, samantha latest news, samantha comments on rajamouli, samantha tweet on rajamouli, samantha news, samantha wants to work in bahubali movie, rajamoui latest news, bahubali movie latest news, rajamouli counter attack on samantha, rajamouli tweet on samantha

Samantha want to act in bahubali movie

రాజమౌళిగారు... 10 నిముషాలు వాడుకోండి!

Posted: 07/12/2014 04:29 PM IST
Samantha want to act in bahubali movie

(Image source from: Samantha want to act in bahubali movie)

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘‘బాహుబలి’’. టాలీవుడ్ లో మొట్టమొదటిసారిగా 100 కోట్ల కంటే ఎక్కువ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం మొత్తం చారిత్రాత్మక నేపథ్యంలో నడుస్తుంది. ఇంతటి భారీ అంచనాలతో తీస్తున్న ఈ చిత్రంలో కనీసం గెస్ట్ రోల్ నటించడానికైనా అవకాశం వస్తే ఎవరు వద్దంటారు చెప్పండి..! అయితే సమంత ఇందుకు భిన్నంగా నో అని తెగేసి చెప్పిందట!

‘‘బాహుబలి’’ సినిమాలో ఓ గెస్ట్ రోల్ పాత్ర చేయాలని గతంలో రాజమౌళి, హీరోయిన్ సమంతని కోరాడు. కానీ ఆమె మాత్రం డేట్స్ లేవని చెప్పి తప్పించుకుందని రాజమౌళి పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు మాత్రం సమంత రాజమౌళి వెంటపడుతూ... 10 నిముషాలవరకు బాహుబలి సినిమాలో గెస్ట్ రోల్ పాత్ర ఇవ్వాల్సిందిగా వెంటపడుతున్నట్టు సమాచారం! ‘‘రాజమౌళిగారు... నన్ను 10 నిముషాలవరకు వాడుకోవచ్చు’’ అనే స్టేట్ మెంట్లను బహిరంగంగానే చేస్తోంది సమంత!

తాజాగా ‘‘బాహుబలి’’ సినిమాలో తమ అందాలతార సమంత నటిస్తే చూడాలని వుందని కొందరు అభిమానులు ట్విటర్ లో కోరారు. దానికి సమంత కూడా జవాబిస్తూ.. ‘‘నాకు బాహుబలి సినిమాలో నటించాలని వుంది కానీ.. రాజమౌళిగారే అవకాశం ఇవ్వడం లేదు’’ అని రీట్వీట్ చేసింది. ఇక్కడివరకు బాగానే వుంది కానీ.. ఈ విషయం గురించి తెలుసుకున్న రాజమౌళికి కొంతవరకు కోపం వచ్చినట్లు తలుస్తోంది. సమంత ఇచ్చిన స్టేట్ మెంట్ రాజమౌళి కౌంటర్ ఎటాక్ ఇచ్చినట్లు ట్వీట్ చేశాడు.

‘‘నువ్వు ఎందుకిలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు..? బాహుబలి సినిమాలో గెస్ట్ రోల్ చేయమని నేను నిన్ను పర్సనల్ గా అడిగితే.. నువ్వు డేట్స్ లేవని తప్పించుకున్నావు. ఇప్పుడేమో నేనే అవకాశం ఇవ్వడం లేదని నీ అభిమానులకు నామీద వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నావు’’ అని తన మనసులో వున్న ఆవేశాన్ని ట్వీట్ ద్వారా కౌంటర్ ఎటాక్ ఇచ్చాడు. అయితే దీనికి సమంత ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు.

దీనిపై కొంతమంది సినీ విశ్లేషకులు... రాజమౌళి పుణ్యమా అని భవిష్యత్తుల్లో సమంతకు గెస్ట్ రోల్ పాత్ర నటించే ఛాన్స్ వుంటే వుండొచ్చని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమంత అభిమానులు కూడా ఇలాగే జరగాలని కోరుకుంటున్నారు. మరి రాజమౌళి సమంతకు గెస్ట్ రోల్ ఆఫర్ ఇస్తాడా..? సమంత అభిమానుల కోరికను తీరుస్తాడా..? ఇటువంటి ప్రశ్నలకు జవాబు కోసం కొన్నాళ్లవరకు ఆగాల్సిందే! బెస్టాఫ్ ఆఫ్ లక్ సమంత!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles