Actress sravya controversial comments on ram gopal varma

Actress sravya controversial comments on ram gopal varma, telugu actress sravya latest news, telugu actress sravya comments on ram gopal varma, ram gopal varma latest news, ram gopal varma news, telugu actress sravya latest movie news, telugu actress sravya interview

Actress sravya controversial comments on ram gopal varma

వర్మను ఛీకొట్టిన బీటెక్ పాప!

Posted: 07/12/2014 03:05 PM IST
Actress sravya controversial comments on ram gopal varma

(Image source from: Actress sravya controversial comments on ram gopal varma)

ఆర్య, సందడే సందడి, ఔనన్నా కాదన్నా వంటి సినిమాల్లో బాలనటిగా తెలుగుతెరకు పరిచయమైన శ్రావ్య... ‘‘లవ్ యు బంగారం’’ సినిమాతో కథానాయికగా కెరీర్ ను ప్రారంభించింది. సినిమాల్లో ఎటువంటి పాత్రల్లో నటించడానికైనా సిద్ధమని చెప్పుకున్న ఈ హాట్ భామ... తన అందాలను ఆరబోసేందుకు కూడా సై అంటోంది. సినిమా కెరీర్ ను మెరుగుపరచుకోవడానికి దేనికైనా రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది.

శుక్రవారంనాడు తన జన్మదిన సందర్భంగా ఆమె మీడియాతో తన జీవితానికి సంబంధించిన కొన్ని విషయాల గురించి విశ్లేషించింది. ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఈ అమ్మడు... తనకు సినిమా నేపథ్యం లేకిపోయినా దానిమీదున్న మోజుతో ఇండస్ట్రీని  ఎంట్రీ ఇచ్చానని చెప్పుకుంది. మొదట్లో మారుతి చిత్రంలో అవకాశం వచ్చినా.. ఆరోజుల్లో పరీక్షల కారణంగా అందులో నటించలేకపోయానని, ఆ తరువాత ‘‘లవ్ యు బంగారం’’ చిత్రం కోసం ఆయనే పిలిచి ఆఫర్ ఇచ్చారని తెలుపుకుంది.

ఈ సందర్భంలో తనకు ఎటువంటి పాత్రలు చేయడం ఇష్టం అని ప్రశ్నిస్తే... ‘‘బొమ్మరిల్లు సినిమాలో జెనీలియా చేసిన పాత్ర అంటే చాలా ఇష్టం. అటువంటి పాత్రలాంటిది దొరికితే చేయాలనుంది’’ అని సమాధానం ఇచ్చింది. ఈ నేపథ్యంలో... ఏ సినిమాల్లో నటించడానికైనా సిద్ధమని చెప్పిన శ్రావ్య.. వివాదాస్పద దర్శకుడు అయిన రాంగోపాల్ వర్మ సినిమాలో నటించడానికి అవకాశం వస్తే చేయనని తెగేసి చెప్పింది. స్వయానా ఆయనే వచ్చి ఆఫర్ ఇచ్చినా... దానిని తిరస్కరిస్తానని ఖరాఖండిగా చెప్పేసింది. ఎందుకు అని ప్రశ్నిస్తే... దానికి సమాధానం ఇవ్వకుండా ముఖం చాటేసిందట!

బహుశా రాంగోపాల్ వర్మ అటెన్షన్ కోసమే ఈ అమ్మడు ఇటువంటి కామెంట్లు చేసి వుంటుందని సినీ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు.  ప్రస్తుతం ఈమె ‘‘కాయ్ రాజా కాయ్’’ సినిమాలో నటిస్తున్నానని చెప్పిన ఆమె... శర్వానంద్, నిత్యమీనన్ జంటగా కె.ఎస్.రామారావు నిర్మిస్తున్న ఒక చిత్రంలో ముఖ్యపాత్రను పోషించనుందని చెప్పింది. అలాగే ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోగానే సినిమాలమీదే దృష్టి పెడతానని స్పష్టం చేసింది. ఏదిఏమైనా ఈ అమ్మడు తనను తాను ప్రమోట్ చేసుకోవడం కోసమే వివాదాస్పద దర్శకుడైన రాంగోపాల్ వర్మను పేరును వాడుకుంటోందని చెప్పుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles