Tamanna big party to bollywood directors

tamanna big party to bollywood directors, Tamanna drunk party, south india actress tamanna

tamanna big party to bollywood directors.

ఫుల్లుగా తాగి ఊగిన దర్శక, నిర్మాతలు...

Posted: 07/05/2014 06:54 PM IST
Tamanna big party to bollywood directors

కెరియర్ మాంచి ఊపులో ఉన్నప్పుడు సౌత్ ఇండస్ట్రీ నుండి బాలీవుడ్ కి చాలా మంది భామలు వెళ్లి తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అలాంటి వారిలో తమన్నాకూడా ఒకరు. సౌత్ లో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న టైంలో బాలీవుడ్ లో హిమ్మత్ వాలా చిత్రంతో అడుగుపెట్టింది. ఎన్నో ఆశలతో అక్కడ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడుకు ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని కాదు కదా ఆమె కెరియర్ లో అట్టర్ ప్లాప్ డెబ్యూట్ మూవీగా మిగిలిపోయింది.

దీంతో రెండో అవకాశం కోసం ఎదురు చూడగా సాజిద్ ఖాన్ పిలిచి ‘హమ్ షకల్ ’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. ఈ చిత్రం ఇటీవలే విడుదల అయ్యి  ప్లాప్ టాక్ తెచ్చుకుంది. దీంతో బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గిపోతాయనే బెంగ తమన్నాకు పట్టుకుంది. ఎలాగు టాలీవుడ్ లో అవకాశాలు లేవు కాబట్టి, బాలీవుడ్ నే పట్టుకొని వేళ్ళాడదామనుకొని తన స్నేహితులు ఇచ్చిన సలహా మేరకు అక్కడున్న దర్శక నిర్మాతలను కాకా పట్టమని చెప్పడంతో వాళ్లిచ్చిన సలహా మేరకు ఓ మందు పార్టీ ఏర్పాటు చేసిందని ముంబై వర్గాల సమాచారం ముంబైలో జరిగిన ఆ పార్టీలో బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు బడా బడా నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నట్టు వార్తలు. అకాశం ఇచ్చేది దర్శక, నిర్మాతలే కాబట్టి ఈ పార్టీకి హీరోల్ని పిలవలేదట.

ఆ పార్టీ కోసం తెల్ల పిల్ల చేసిన ఏర్పాట్లు చూసి బడా బాబుల కళ్ళు బైర్లు కమ్మాయట. పార్టీ జరగుతున్నంత సేపు అందరితో చాలా క్లోజ్ గా ఉండటమే కాకుండా, అందరికి మంచి నిషా ఎక్కిన తరువాత  హిందీలో ఎక్కువ సినిమాల్లో నటించాలనుకుంటున్నానని ప్రకటించిందట. పనిలో పనిగా పారితోషికం తగ్గించుకుంటానని కూడా మాటలో మాట అనేసిందట. మరి ఫుల్లుగా తాగిన సదరు దర్శక నిర్మాతలు ఈ అమ్మడు మాటను విన్నారో లేదో గానీ ఈ అమ్మడుకు బిల్లు మాత్రం తడిపి మోపెడు అయిందట.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles