Ram charan guest role in chiru 150 movie

ram charan guest role in chiru 150 movie, ram charan act in chiranjeevi 150th movie, ram chnaran talks about chiru 150 movie

ram charan guest role in chiru 150 movie

నాన్న సినిమాలో చిన్న పాత్ర చేస్తా : చరణ్

Posted: 07/07/2014 11:32 AM IST
Ram charan guest role in chiru 150 movie

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అప్పుడెప్పుడో బంజారాహిల్స్ గొడవ సందర్బంలో మీడియా ముందుకు వచ్చాడు. ఆ తరువాత ఇతని పై, ఇతను నటిస్తున్న సినిమా పై ఎన్నో పుకార్లు వచ్చాయి. వాటన్నింటి పై చరణ్ ఏనాడు స్పందించలేదు. సోషల్ నెటవర్కింగ్ సైట్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా అప్పుడప్పుడు కొన్ని విషయాలను ఫ్యాన్స్ తో పంచుకునే చరణ్ ఎవరూ ఊహించని విధంగా మీడియా ముందుకు ఓ కొత్త గెటప్ లో దర్శనం ఇచ్చి ఆశ్చర్య పరచడమే కాకుండా, చాలా విషయాలన్ని మనస్సు విప్పి చెప్పాడు.

ముఖ్యంగా తన తండ్రి 150 సినిమా పై ఉన్న వార్తల పై ఓ క్లారిటీ ఇచ్చాడు. నాన్న గారి 150 సినిమా అంటే మెగా ఫ్యామిలీకే ఎంతో ప్రత్యేకమైనదే కాకుండా, మరుపు రానిది కూడా. అలాంటి సినిమాలో నాన్న గారితో పాటు నేను కూడా చిన్న పాత్ర పోషిస్తాను. మాకు ఎంతో ప్రత్యేకమైన ఈ సినిమాను సొంత బ్యానర్లో అదీ అమ్మ నిర్మాతగా వ్యవహరిస్తారని చెప్పుకొచ్చాడు.

150 సినిమాకు కథ చెప్పినందుకు కోటి రూపాయలు ఇస్తారనే ప్రచారం జరిగింది. దాని గురించి చెబుతూ... మాకు నచ్చే కథ ‘ఎలాంటి చేర్పులు మార్పులు ’ లేకుండా చెప్పితే కోటి రూపాయలు ఇవ్వడానికి మేం సిద్దం. ఇప్పటికే చాలా కథలు విన్నా ఏదీ ఓకే కాలేదని చెప్పాడు. అంటే ఇటీవలి కాలంలో కథ, దర్శకుడి విషయంలో వచ్చిన వార్తలు పుకార్లే అన్నమాట. ఇక తన సినిమా గోవిందుడి గురించి మాట్లాడుతూ... ఈ సినిమాతో కొత్త రామ్ చరణ్ ని చూస్తారని, సినిమాను ఎంజాయ్ చేస్తూ చేస్తున్నానని, కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్నో నేర్చుకున్నానని, ఈ సినిమాలో హెయిర్ స్టైల్ ఆకట్టుకుందటుందని చెప్పాడు. బహుశా చిరంజీవి జన్మదినం అయిన ఆగష్టు 22న ఆ కొత్త సినిమా విశేషాలను ప్రకటించే అవకాశం వుందని తెలుస్తుంది.

అప్పటి వరకు కథ, దర్శకుడు ఫైనల్ అయితేనే. ఇక గోవిందుడి అందరి వాడేలేను అక్టోబర్ 1న విడుదల చేయానికి సన్నాహాలు చేస్తున్నారు. మగధీరలో చరణ్ కోసం చిరు ఓ స్టెప్ వేస్తే... ఇప్పుడు తండ్రి సినిమాలో చరణ్ గెస్ట్ గా చేయబోతున్నాడన్న మాట. మొత్తానికి చరణ్ చాలా కాలం తరువాత ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇచ్చాడని చెప్పవచ్చు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles