Trivikram script work for gopala gopala

Trivikram Script Work For Gopala Gopala, Trivikram involved Gopala Gopala script work, venky-pawan multistarrer Gopala Gopala, Trivikram Pawan Kalyan, Trivikram dialogues for Gopala Gopala,

Trivikram Script Work For Gopala Gopala, Trivikram involved Gopala Gopala script work, venky-pawan multistarrer Gopala Gopala, Trivikram Pawan Kalyan, Trivikram dialogues for Gopala Gopala,

గోపాల..గోపాలకు మాంత్రికుడి సలహాలు

Posted: 06/14/2014 08:54 AM IST
Trivikram script work for gopala gopala

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులతో సినిమాలు చేసినా, ఆయన నమ్మిన బంటు మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాసే అనిపిస్తుంది. జల్సా, అత్తారింటికి దారేది సినిమాలు పెద్ద ఘన విజయం సాధించడమే కాకుండా, పవన్ ఇమేజ్ ని రెట్టింపు చేశాయి. ఇటీవల అత్తారింటికి దారేది సమయం నుండి వీరిద్దరి మధ్య స్నేహం మరింత బలపడింది. అదీ గాక పవన్ కళ్యాణ్ ని తెర పై ఎలా ప్రెజెంట్ చేయాలో త్రివిక్రమ్ కి బాగా అర్థం అయ్యింది.

దీంతో పవన్ ఆయన చేయబోయే సినిమాలకు అతని సహాయం తీసుకుంటున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘గోపాల గోపాల ’ చిత్రంలో ఓ 30 నిమిషాలు పాత్ర పోషించబోతున్నాడు. ఈ చిత్రానికి డాలీ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం పవన్ త్రివిక్రమ్ ని ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో సలహాలు ఇమ్మని అడగటంతో ఇందులో ఆయన ఇన్వాల్వ్ అవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఈ సినిమాలో  పవన్ ఇమేజ్ ఏమాత్రం తగ్గకుండా ఆయన పాత్రను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసినట్ల తెలుస్తోంది. ఈ సినిమా షూటింగు ఇటీవలే మొదలైంది. పేరుకు డాలీ దర్శకత్వం వహిస్తున్నా, త్రివిక్రమ్ ఎంటర్ అయ్యాడంటే ఈ సినిమాలో ఆయన మార్క్ తప్పకుండా కనిపించబోతునందన్న మాట.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles