Preity zinta files complaint against ness wadia

Preity Zinta files complaint on ness wadia, Preity zinta, ness wadia, Preity Zinta, molestation, complaint, ness wadia, kings panjab, Mumbai police, co-owner of Kings XI Punjab cricket team

Bollywood actress Preity Zinta files complaint against Ness Wadia.

మాజీ ప్రియుడి పై పోలీస్ కంప్లెంట్ ఇచ్చింది

Posted: 06/14/2014 10:07 AM IST
Preity zinta files complaint against ness wadia

మొగుడు కొట్టినందుకు కాదు... పక్కోడు నవ్వందుకు అన్నట్లు ఉంది బాలీవుడ్ నటి ప్రతీజింటా వ్యవహారం. నాలుగు పదుల వయస్సుకు మరో అడుగు దూరంలో ఉన్న ప్రీతీజింటా ఇప్పటికీ పెళ్లయితే చేసుకోలేదు కానీ, వ్యాపార వేత్తలతో ఎఫైర్లు మాత్రం నడుపుతుంది. ఈ అమ్మడు గతంలో ప్రముఖ వ్యాపార వేత్త అయిన నెస్ వాడియాతో ప్రేమలో మునిగి అచ్చట ముచ్చట కానిచ్చింది. వీరిద్దరు కలిసి ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ లెవన్ కి కో ఓనర్లుగా వ్యవహరిస్తున్నారు.

ఇంకేముంది వీరిద్దరు పెళ్లి చేసుకోవడం ఖాయం అని అనుకున్న టైంలో ఏమైందో ఏమో గానీ వీరిద్దరి మధ్య బంధం చెడింది. ఇప్పుడు ఏకంగా తన మాజీ ప్రియుడి పై పోలీస్ కేసు పెట్టింది. తన మాజీ ప్రియుడు  నెస్ వాడియా తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని, అంతే కాకుండా తనపై చేయి చేసుకున్నాడని ప్రీతి జింతా ఆరోపించింది.ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడినట్లు కూడా ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన పంజాబ్-చెన్నై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వాంఖడే స్టేడియంలో జరిగిందని తన ఫిర్యాదులో పేర్కొంది.

ప్రీతి ఫిర్యాదు మేరకు ముంబయి మెరైన్ డ్రైవ్ పోలీసులు నెస్ వాడియాపై పలు సెక్షన్ల (354, 504, 506,509 సెక్షన్లు) కింద కేసు నమోదు చేశారు. ప్రీతి ఫిర్యాదు చేయడం బాగానే ఉన్నా... ఇన్నాళ్ళు అతనితో తిరిగి అన్ని పనులు కానిచ్చినప్పుడు చేయని ఫిర్యాదు, ఏదో కొన్ని రోజుల నుండి దూరంగా ఉంటున్న అతడు చెయ్యివేసినందుకే ఇలా ఫిర్యాదు చేయాలా ? అని అంటున్నారు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles