One heroine act with mega heros

Kriti sanan, Trivikram, Allu Arjun, Kriti Sanan in allu Arjun movie, Samantha, Ram charan-srenu vaitla movie

Kriti sanan made entry with Mahesh babu Nenokkadine. Kriti may be casted opposite Allu Arjun and Ram charan in his upcoming movies.

ఒకేసారి ఇద్దరు మెగా హీరోలతో...

Posted: 04/15/2014 03:27 PM IST
One heroine act with mega heros

టాలీవుడ్ లోకి మహేష్ బాబు ‘వన్ ’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి, ఆ సినిమా అంతంత మాత్రం విజయం సాధించినా హీరోయిన్ గా మంచి మార్కులు వేయించుకున్న కృతి సనాన్ పైపు చూసేవారు కరువయ్యారు. కానీ చాలా రోజుల తరువాత ఈ అమ్మడుకు రెండు భారీ ఆఫర్లు అదీ మెగా హీరోల సరసన దక్కినట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం.

ఈ అమ్మడు వరుసగా అల్లు అర్జున్ - త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అనుకున్నారు. అందులో మొదటి హీరోయిన్ గా సమంతాను తీసుకోగా, రెండో హీరోయిన్ గా ఈమెను తీసుకున్నారట. అదీ కాకుండా త్వరలో శీనువైట్ల – రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కబోయే సినిమాలో ఈమెను తీసుకోవాలనే ఆలోచనలో ఉందట ఆ చిత్ర యూనిట్.

అదే అవకాశం కృతి సనాన్ కి దక్కితే మాత్రం వరుసగా మెగా హీరోలతో ఛాన్స్ కొట్టేసిన మెగా హీరోయిన్ అనిపించుకోవడమే కాకుండా, టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోయిన్ అవుతుందని అంటున్నారు. ఆల్ ది బెస్ట్ కృతి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles