Priyanka leading role in madamji movie

Zoya Akhtar,Priyanka Chopra,Mary Kom,Madhur Bhandarkar,Madamji,fashion,Dil Dhadakne Do,Calender Girls,Bollywood, CM Jayalalitha, Madamji movie on Jayalalitha

Madhur finally confirms that Priyanka Chopra is his Madamji but admits that he cannot roll for at least seven months; has a Plan B ready.

ముఖ్యమంత్రి పాత్రలో ప్రియాంక

Posted: 03/10/2014 09:50 AM IST
Priyanka leading role in madamji movie

త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయ్... దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రావడంతో జనాల్ని ఆకట్టుకునేందుకు రాజకీయ నాయకులు ప్రచారానికి సినీ గ్లామర్ అద్దే ప్రయత్నాలు చేస్తుంటే... కొందరు వెండి తెరకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లో తన అద్రుష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమౌతున్న విషయం తెలిసిందే.

బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా రాజకీయాల్లోకి వచ్చి, ఏకంగా ముఖ్యమంత్రి కాబోతుంది. రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో. ఇటీవలి కాలంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాల్లో నటిస్తున్న ప్రియాంక ఇప్పుడు మరో సినిమాకు కమీట్ అయ్యింది. బాలీవుడ్ టాప్ డైరెక్టర్ మధుర్ బండార్కర్ తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లైఫ్ స్టోరీ పై ఓ సినిమాను తీయబోతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జయలలిత పాత్రలో కనిపించబోతుంది. ఇందులో జయలలిత సినిమాల్లోకి ఎలా వెళ్లారు..? అక్కడ ఎలా రాణించారు..? తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశం వంటి అంశాలను తెరకెక్కించబోతున్నట్లు చెప్పాడు మాధూర్. స్ర్కిప్ట్ పూర్తయిన తర్వాత తనకు చూపించాలని ఆమె చెప్పినట్లు సినీ వర్గాల సమాచారం.

ఇప్పటికే బాక్సింగ్ ఛాంపియన్ మేరీ‌కోమ్ లైఫ్‌ స్టోరీ పై వస్తున్న సినిమాలో నటిస్తున్న ప్రియాంక ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి పీఠం పైనే కన్నేసిందని అనుకుంటున్నారు. సినీ రంగంతో కెరియర్ ప్రారంభించి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్న జయలలిత హిస్టరీలో చాలా వివాదాలే ఉన్నాయి. వాటన్నింటిని కూడా కూడా తెరకెక్కిస్తాడా లేదా అన్నదే ఇక్కడ ఆసక్తికరం. ఈమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే తరువాత సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles