Tamilnadu election effect on rajinikanth kochadaiyaan movie

rajinikanth, jayalalitha, tamilnadu cm jayalalitha, tamilnadu election,rajinikanth kochadaiyaan movie, rajinikanth kochadaiyaan, kochadaiyam movie released, kochadaiyam movie postpone.

tamilnadu election effect on rajinikanth kochadaiyaan movie

రజనీ సినిమాకు ‘అమ్మ’దెబ్బ మరోసారి వాయిదా?

Posted: 03/08/2014 03:30 PM IST
Tamilnadu election effect on rajinikanth kochadaiyaan movie

తమిళ సూపర్ స్టార్  రజనీకాంత్  నటించిన  కొచ్చాడియాన్' సినిమాకు మొదటి నుంచి కష్టాలే.  రజనీకాంత్ కూతురు దర్శకత్వంలో వస్తున్న కొచ్చాడియాన్' సినిమా పై  రజనీ అభిమానులు ఆశగా  ఎదురుచూస్తున్నారు.  

ఆకలైన పిల్లావాడి మాదిరి  రజనీ అభిమానులు ఆయన సినిమాలు లేక అల్లాడిపోతున్నారు.    త్వరలో రజనీకాంత్ సినిమా వస్తుందని ఆశపడిన ఆయన అభిమానులకు .. ‘అమ్మ ’ రూపంలోమరో దెబ్బ తగలనుందని కోలీవుడ్  వర్గాలు అంటున్నాయి. 

ఇప్పటికే రజనీకాంత్  నటించిన కొచ్చాడియాన్' పలుసార్లు వాయిదా పడిన ఈ సినిమా విడుదల కార్యక్రమం మరోసారి వాయిదే పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  తమిళనాడు (అమ్మ)  ముఖ్యమంత్రి  జయలలిత  పార్టీ పదవి ముగియంతో.. అక్కడ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఈ సారి  రజనీ సినిమాకు  ఎన్నికల అడ్డం వస్తున్నాయని  నిర్మాతలు అంటున్నారు.  ఇటీవల  ఏప్రిల్ 11న దీనిని విడుదల చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించి, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే, తాజాగా వచ్చిన ఎలక్షన్ల ప్రకటన ఈ సినిమా విడుదలపై ప్రభావం చూపుతోంది. తమిళనాడులో ఏప్రిల్ 24న లోక్ సభ ఎన్నికలు జరుగుతుండడంతో, ఆ ప్రచార కార్యక్రమాల వల్ల ఈ సినిమాకు కలక్షన్ల పరంగా నష్టం కలుగుతుందని నిర్మాతలు ఇప్పుడు ఆలోచిస్తున్నారు.

అందుకే, విడుదలను మే నెలకు వాయిదా వేసుకుంటే ఎలా వుంటుందన్న విషయంపై ప్రస్తుతం తర్జనభర్జనలు పడుతున్నారు. దీనిపై రజనీ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles