Ntr agreed to do a film with sukumar

Jr NTR, Shiva, Puri Jaganath, Sukumar, Rabhasa, NTR and Sukumar, Puri jaganath,

Ntr 25th film and Santhos Srinivas Rabhasa is 23rd film of Jr.NTR.He also have hearing the scripts of Puri Jaganath and Shiva.

పావు సెంచరీకి చేరువగా జూనియర్

Posted: 03/03/2014 07:49 PM IST
Ntr agreed to do a film with sukumar

గత కొంత కాలం నుండి తన ఇమేజ్ కి తగ్గ హిట్టు కొట్టని జూనియర్ ఎన్టీఆర్ ఏ మాత్రం నిరాశ చెందకుండా సినిమాలు చేసుకొని పోతున్నారు. ఇండస్ట్రీకి బాల నటుడిగా పరిచయం అయిన ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికీ 22 చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం 23 వ సినిమాగా ‘రభస ’ చేస్తున్న ఈ బుడ్డోడు త్వరలోనే పావు సెంచరీ (25) ని అందుకోబోతున్నాడు.

24వ సినిమా పూరి జగన్నాథ్ తోను, 25వ సినిమా సుకుమార్ తో చేయనున్నట్టు జూనియర్ ఎన్టీఆర్ డేట్స్ కూడా ఇచేసినట్టు ఫిలిం వర్గాల సమాచారం. సెప్టెంబర్ నుంచి కానీ అక్టోబర్ మొదటి వారం నుంచి సుకుమార్ తో చిత్రం మొదలు కానుంది. ఈ నెలాఖరున ఎన్టీఆర్ తన తదుపరి చిత్రం ప్రకటన చేసే అవకాసం ఉంది. అయితే నేనిక్కడినే చిత్రం కమర్షియల్ గా డిజాస్టర్ కావటంతో ఈ కాంబినేషన్ లో సినిమా ఆగిపోయిందంటూ వార్తలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. అయితే ఈ విషయమై మీడియాతో సుకుమార్ మాట్లాడి క్లారిఫై ఇచ్చారు. ఆయన అటువంటిదేమీ లేదని స్పష్టం చేసారు.

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ కంటే ముందుగానే హీరో రోల్స్ చేయడం ప్రారంభించినా సినిమాల సంఖ్యలో వెనకే ఉన్నారు. జూనియర్ ఎన్టఆర్ క్వార్టర్ సెంచరీకి చేరువ అవుతుండటంతో ఆయన అభిమానుల్లో ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.  ఈ సినిమాకి బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాత గా వ్యవహరిస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles