టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి స్నేహ తమిళ హీరోను పెళ్లి చేసుకొని గత కొంత కాలంగా సినిమాలకు దూరం అయిన విషయం తెలిసిందే. ఈ మధ్యనే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన స్నేహ సినిమాల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో ఐదారు సినిమాలు ఉన్నాయి. సాధారణం పెళ్లి తరువాత సినిమాలు తగ్గిపోతాయి. కానీ ఏ పాత్ర చేయడానికైనా సిద్దపడ్డ స్నేహా ఓ తమిళ సినిమాలో తల్లిపాత్రను పోషిస్తుంది. ఇటీవల ఓ సందర్బంలో మాట్లాడుతూ సినిమాల్లో మంచి పాత్రలు వస్తే ఏదైనా చేస్తాను, ఎంతకాలమైనా ఎదురు చూస్తాను... కానీ సినిమా ఛాన్సులు ఇవ్వాలని ఎవరినీ అడుక్కోను అంటోంది. ప్రస్తుతం ఆమె శర్వానంద్ హీరోగా రూపొందుతున్న ‘ఏమిటో ఈ మాయ' చిత్రంతో పాటు, ప్రకాష్ రాజ్ దర్శకత్వంలో రూపొందబోయే ఉలవచారు బిర్యానీ చిత్రంలో స్నేహ నటిస్తోంది. మరి ఎంతటి నటి అయినా ఛాన్సుల అడగాల్సిందే. మడి కట్టుకొని కూర్చుంటే ఎవరిస్తారమ్మా ఛాన్సులు ?
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more