Akkineni akhil movie entry announced

akkineni akhil movie entry announced, Akhil akkineni film debut time confirmed, akkineni akhil first movie announced, akkineni akhil new movie, nagarjuna conform akhil entry

akkineni akhil movie entry announced, Akhil akkineni film debut time confirmed, akkineni akhil first movie announced, akkineni akhil new movie, nagarjuna conform akhil entry

అక్కినేని అఖిల్ ఎంట్రీ ఖరారు

Posted: 06/24/2013 12:30 PM IST
Akkineni akhil movie entry announced

అప్పుడెప్పుడో చిన్నప్పుడు ‘సిసింద్రీ ’ గా ప్రేక్షకులను అలరించిన అక్కినేని అఖిల్ వెండితెర పై హీరోగా ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడని అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్యన లో ఈయన ఎంట్రీ పై రకరకాల వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అక్కినేని నాగార్జున ఈయన ఎంట్రీ పై ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చారు. నిన్న అక్కినేని సుశాంత్ నటించిన ‘అడ్డా ’ సినిమా ఆడియోకి వచ్చిన నాగ్ మాట్లాడుతూ... మొన్న గ్రీకువీరుడు ఆడియోకు వచ్చారు, నిన్న నాగచైతన్య ‘తడాఖా ’ ఆడియోకి వచ్చారు, నేడు సుశాంత్ ‘అడ్డా ’ అడియోకి వచ్చారు, రేపు అంటే వచ్చే సంవత్సరం ‘అక్కినేని ‘ అఖిల్  సినిమాఆడియో ఫంక్షన్ కి వస్తారంటూ అఖిల్ ఎంట్రీని ఇన్ డైరెక్ట్ గా కన్ ఫర్మ్ చేశాడు నాగ్. దీంతో ‘శిల్పా కళా వేదిక ’ఈలలో అదిరిపోయింది. దీనిని బట్టి అఖిల్ సినిమా త్వరలో ఉంటుందని  అర్థం చేసుచేసుకోవచ్చు. ఇక ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాల పైనే క్లారిటీ రావాల్సింది ఉంది. అఖిల్ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు ఆమోదించదగ్గ సబ్జెక్టు, స్క్రీన్ ప్లేను ఓ సీనియర్ దర్శకుడుతో రెడీ చేయిస్తున్నాడని టాక్. ఏమైతేనేం నాగ్ స్టేట్ మెంట్ లో ఆయన ఎంట్రీ పై సస్పెన్స్ వీడింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles